London: ఇదేం ట్రెడిషన్ బాబూ.. ప్యాంట్లు తొడుక్కోకుండా లండన్ వీధుల్లో తిరుగుతున్న జనం… కారణమేంటో తెలుసా?

ఆడా, మగా అనే తేడా లేకుండా అందరూ కాస్త పొడవైన అండర్‌వేర్‌లు మాత్రమే తొడుక్కుని బయటకి వచ్చేశారు. కొందరు అలాగే ఆఫీసులకు వెళ్లిపోయారు. ఇంకొందరు లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణం చేశారు. ఆదివారం (జనవరి 8) రోజు ఇలా చేశారు లండన్ వాసులు.

London: ఇదేం ట్రెడిషన్ బాబూ.. ప్యాంట్లు తొడుక్కోకుండా లండన్ వీధుల్లో తిరుగుతున్న జనం… కారణమేంటో తెలుసా?

London: ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా ప్యాంట్ లేదా షాట్ అయినా తొడుక్కుంటారు. అందులోనూ ఆఫీసులకు, పబ్లిక్ ప్లేసులకు వెళ్లేటప్పుడు కచ్చితంగా ప్యాంట్లు తొడుక్కునే వెళ్తారు. కానీ, లండన్‌లో మాత్రం ప్యాంట్లు తొడుక్కోకుండానే జనాలు రోడ్లమీదికి వచ్చేశారు.

Telangana : కారులో పడేసి వ్యక్తి సజీవ దహనం..సగం కాలిన బాడీ చూసి హడలిపోయిన స్థానికులు

ఆడా, మగా అనే తేడా లేకుండా అందరూ కాస్త పొడవైన అండర్‌వేర్‌లు మాత్రమే తొడుక్కుని బయటకి వచ్చేశారు. కొందరు అలాగే ఆఫీసులకు వెళ్లిపోయారు. ఇంకొందరు లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణం చేశారు. ఆదివారం (జనవరి 8) రోజు ఇలా చేశారు లండన్ వాసులు. అయితే, దీనికో కారణం ఉంది. ఎందుకంటే ఈ రోజు ‘నో ట్రౌజర్స్ డే’. అంటే ఆ రోజు అక్కడి వాళ్లు ఎవరూ ప్యాంట్లు తొడుక్కోరు. అక్కడ ప్రతి సంవత్సరం.. ఏడాదికో రోజు దీన్ని జరుపుకొంటారు. దీనిలో భాగంగా ఆదివారం 12వ ‘నో ట్రౌజర్ డే’ను నిర్వహించారు. అందుకోసమే వేలాదిమంది దీనిలో పాల్గొన్నారు. ప్యాంట్లు లేకుండా, పై భాగంలో మాత్రం మంచి సూట్స్ ధరించి లండన్ వీధుల్లో తిరిగారు.

Telangana: తెలంగాణను వణికిస్తున్న చలి.. సాధారణంకన్నా 3-5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు

న్యూయార్క్ నగరంలో 2002లో ఇది ప్రారంభమైంది. అప్పట్నుంచి అనేక దేశాలు, నగరాల్లో దీన్ని జరుపుకొంటున్నారు. లండన్‌లో ‘ద స్టిఫ్ అప్పర్ లిప్ సొసైటీ’ అనే సంస్థ ఆధ్వర్యంలో ‘నో ట్రౌజర్ డే’ను జరుపుతారు. అయితే, ఈ డే సెలబ్రేట్ చేయడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. కేవలం సరదా కోసమే దీన్ని నిర్వహిస్తున్నారు. ఇక ‘నో ట్రౌజర్ డే’కు సంబంధించి ప్యాంట్లు లేకుండానే జనాలు తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.