Chinese Man wish : అవన్నీ అయ్యే పనేనా !!
కారు కావాలి.. బంగ్లా కావాలి.. మంచి భార్య కావాలి.. ఇలాంటి కోరికలు ఉండటం సహజమే. ఓ యువకుడివి మామూలు కోరికలు కావు.. తన కోరికలు నెరవేర్చమని వేడుకోవడానికి 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసాడు. బుద్ధుని విగ్రహం ముందు చిట్టా విప్పాడు. ఎక్కడ? ఎవరతను? చదవండి.

Chinese Man wish
Chinese Man wish : హెడ్డింగ్ చదవగానే చాలామందిలో చాలా రకాల అనుమానాలు వస్తాయి. ఏమై ఉంటుందా? అని .. భగవంతుడి ముందు చాలామంది కోరికల చిట్టాలు విప్పుతారు. వరాలీయమని వేడుకుంటారు. కానీ వాటికీ ఒక అర్ధం, పర్ధం ఉండాలి కదా.. ఓ చైనా యువకుడు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి జెయింట్ బుద్ధ విగ్రహం ముందు మామూలు వరాలు కోరలేదు.
జాంగ్ అనే చైనా యువకుడివి చాలా చిన్న కోరికలు. నిజమా? అంటే చదవండి.. జాంగ్‌కి జస్ట్ ధనవంతుడు కావాలనే కోరిక ఉంది. అది కూడా 10 మిలియన్ యువాన్లు ఉంటే చాలు. అంటే 11.81 కోట్ల రూపాయలన్నమాట.. ఇక తనకంటే అందంగా, సున్నితంగా ఉండటంతో పాటు తనని బాగా ప్రేమించే స్నేహితురాలు కావాలట. అంతే..
ఈ రెండు కోరికలు నెరవేర్చమని అడగటానికి 2000 వేల కిలోమీటర్లు ప్రయాణించి 71 అడుగుల ఎత్తు ఉన్న బుద్ధుని విగ్రహం వద్దకు చేరుకున్నాడు. తన కోరికలు బుద్ధుని చెవిన వేయడానికి పెద్ద ఎయిర్ ప్యాడ్ ఆకారంలో ఉన్న స్పీకర్‌ను పట్టుకున్నాడు. ఈ స్పీకర్లు కూడా ప్రత్యేకంగా కొన్నాడట. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్టింగ్ వెల్లడించింది.
Organic Oil : గానుగ నూనె తయారీ పరిశ్రమలతో ఉపాధి పొందుతున్న వాసాలమర్రి యువకుడు
ఇక ఇతని కోరికలు విన్న నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ‘తనపై, ఇతరులపై కాకుండా బుద్ధునిపై ఆధారపడ్డాడని’ అని కొందరు..’ బుద్దుడు ఇయర్ ఫోన్‌లో చెప్పిన కోరికలు వినలేదా?’ అని కొందరు ప్రశ్నించారు. ఇతని కోరికలు నెరవేరతాయా? లేదా? అన్నది కాలమే చెప్పాలి మరి.