మాస్కుల్లేకుండా చైనా క్లబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్న వూహాన్ వాసులు

క్లోజ్‌డ్ రూంలో ఎక్కువ మంది ఉండడానికే మనం భయపడిపోతుంటే.. కొవిడ్-19 (కరోనా వైరస్) పుట్టుకొచ్చిన వూహాన్ లో మాత్రం విచ్ఛలవిడిగా మాస్కుల్లేకుండా తిరిగేస్తున్నారు. గతేడాది మే నెల నుంచి వణుకు పుట్టిస్తున్న కరోనా.. 2020లో ఇండియాపై ప్రభావం చూపించింది. మనం ఇంత సీరియస్ గా తీసుకుంటుంటే అక్కడ యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. పైగా మూసి ఉండే ఏసీ క్లబ్బుల్లో మాస్కులు కూడా లేకుండా చిందులేస్తున్నారు.
హ్యుబీ రాజధానిలోని ఓ డిస్కో క్లబ్ పరిస్థితి ఇది. దశలవారీగా మనం ఇంకా అన్నింటినీ ఓపెన్ చేయకపోయినా చైనా క్లబ్బులు అన్నీ తెరచుకున్నాయి. వూహాన్ తర్వాత బ్రెజేన్ లో నమోదైన కేసులు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల 9.9మిలియన్ మందికి టెస్టులు నిర్వహించి కొవిడ్-ఫ్రీ అని అధికారులు అనౌన్స్ చేసేశారు.76రోజుల లాక్ డౌన్ తర్వాత జరిగిన పరిణామాలు ఇవి.
బిజినెస్‌లతో పాటు ఫ్యాక్టరీలు, రెస్టారెంట్లు, సినిమాలు, కరాకే లాంజెస్ ను సేమ్ అంతకుముందు కెపాసిటీకి సరిపడ మందితో రీ ఓపెన్ చేసేశారు. కాకపోతే క్లబ్బుల్లోకి ఎంటర్ అయ్యేముందు హెల్త్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. ఇటువంటి ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే లోనికి రానిస్తున్నారు.
కొందరు మాత్రం మాస్కులు ధరించకుండా ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా లోపలికి వెళ్లిపోతున్నారు. ఇవన్నీ వూహాన్ ప్రభుత్వ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వందల మంది మాస్కులు లేకుండా వూహాన్ వాటర్ పార్క్ లో ఎంజాయ్ చేస్తున్నారు. దానిని చైనీస్ స్టేట్ మీడియా సాధారణ జీవితాల్లోకి తిరిగి అడుగుపెట్టామని రాసుకొచ్చింది.
గత శీతాకాలంలో 50వేలు ఉన్న ఇన్ఫెక్షన్లు సున్నాకు పడిపోయాయి. వూహాన్ లో 2వేల 500మంది చనిపోయారు కూడా. చైనా వ్యాప్తంగా 77శాతం మంది కరోనావైరస్ బాధితులు ఉన్నారు. ‘వూహాన్ రీ ఓపెనింగ్ అంటే అంతా క్లియర్ అయినట్లు కాదని.. మహమ్మారి నుంచి తమను కాపాడుకుంటూనే కొన్ని జాగ్రత్తలతో నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వ్యాపారి వెల్లడించారు.