Pixee Fox : ఇదేందయ్యా ఇది, ఏడా సూడలే..! ఆమె నడుము చూస్తే షాక్ అవ్వాల్సిందే.. రూ.77లక్షలు ఖర్చు చేసి మరీ ఇలా..

కార్టూన్లలో కనిపించే అమ్మాయి లాంటి నడుము కావాలని కోరుకుంది. అందుకోసం ఏకంగా రూ.77లక్షలు ఖర్చు చేసింది. ఎముకలు తొలగించుకుని మరీ కోరిక నెరవేర్చుకుంది.(Pixee Fox)

Pixee Fox : ఇదేందయ్యా ఇది, ఏడా సూడలే..! ఆమె నడుము చూస్తే షాక్ అవ్వాల్సిందే.. రూ.77లక్షలు ఖర్చు చేసి మరీ ఇలా..

Pixee Fox (1)

Updated On : May 31, 2022 / 12:27 AM IST

Pixee Fox : పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి.. అని పెద్దలు ఊరికే అనలేదు. మనుషుల్లో పలు రకాలు. ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన, అభిరుచి. కొందరిది భిన్నమైన టేస్ట్. వారి టేస్ట్ చాలా విభిన్నంగా ఉంటుంది. మరో విధంగా చెప్పాలంటే భయానకంగా కూడా ఉంటుంది. అసలు ఊహకు కూడా అందదు. రీసెంట్ గా.. కుక్కలా కనిపించాలనుకున్న జపాన్ కు చెందిన ఓ వ్యక్తి.. అందుకోసం రూ.11లక్షలు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. చివరికి తాను అనుకున్నది సాధించాడు. కుక్కలా తనను తాను చూసుకుని మురిసిపోయాడు. కుక్కలా కనిపించేందుకు ఆ వ్యక్తి ఏకంగా రూ.11లక్షలు ఖర్చు చేయడం అందరిని విస్మయానికి గురి చేసింది.

Fox

Fox

ఇక మ్యాటర్ లోకి వస్తే.. ఓ మహిళ.. కార్టూన్లలో కనిపించే అమ్మాయి లాంటి నడుము కావాలని కోరుకుంది. అందుకోసం ఆమె తన శరీరంలో చాలా మార్పులు చేయించుకుంది. దీనికోసం ఆమె అక్షరాల రూ.77 లక్షలు ఖర్చు కూడా చేసింది. చివరికి అనుకున్నది సాధించింది. ఇప్పుడామె నడుము 14 అంగుళాలకు చేరింది. ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదా? కానీ, ఇది నిజం.(Pixee Fox)

Pixee

Pixee

ఆమె పేరు పిక్సీ ఫాక్స్. స్వీడన్ కు చెందిన పిక్సీ ఫాక్స్ కు కార్టూన్లలో కనిపించే అమ్మాయిల లాంటి నడుము కావాలన్నది కోరిక. దీనివల్ల నటిగా అవకాశాలు వస్తాయనేది ఆమె నమ్మకం. అంతే.. అలాంటి సన్నని నడుము కోసం ఏకంగా రూ.77లక్షలు ఖర్చు చేసింది. వెన్నెముకకు రెండువైపులా ఉండే 6 ఎముకలను తొలగించుకుంది. దీంతో ఆమె నడుము 14 అంగుళాలకు చేరింది. తనను తాను లివింగ్ కార్టూన్ గా ప్రకటించుకున్న పిక్సీ.. కనురెప్పలు, ముక్కు, వక్షోజాలకు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. 2010లో తొలి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.

Japanese Man: కుక్కగా మారిపోయేందుకు రూ.12లక్షలు ఖర్చు పెట్టిన జపాన్ వ్యక్తి

Pixee Fox (2)

Pixee Fox (2)

యానిమేషన్ కార్టూన్లలో అమ్మాయి బొమ్మలకు నడుం ఉందా లేదా అన్నట్లు ఉంటాయి. అలాంటివి చూస్తూ పెరిగిన పిక్సీ… తనకు కూడా అలాంటి నడుం ఉండాలని బలంగా ఫిక్స్ అయ్యింది. అచ్చం కార్టూన్ బొమ్మలాగే ఉండాలనుకున్న పిక్సీ.. ఇప్పుడు అలాగే కనిపిస్తోంది. ఇందుకోసం ఆమె సర్జరీలు చేయించుకుంది. వాటి కోసం అక్షరాల రూ.77 లక్షల 60వేలు ఖర్చుపెట్టింది.

Living Cartoon

Living Cartoon

వెన్నెముకకు అటు ఇటూ పక్కటెముకలు ఉంటాయి. వాటిలో కింద ఉండే 6 ఎముకలను 2016లో తొలగించుకుంది పిక్సీ. తద్వారా తన నడుము 14 అంగుళాలకు మారేలా చేసుకుంది. ప్రస్తుతం 32 ఏళ్ల పిక్సీని ప్రపంచం లివింగ్ కార్టూన్‌గా గుర్తిస్తోంది. అదే పేరుతో ఆమె సెలబ్రిటీ హోదా పొందుతోంది.

ఎందుకీ ఆలోచన అని అడిగితే.. ”కార్టూన్ క్యారెక్టర్లు.. మహిళ ఎలా ఉండాలో సూచిస్తాయి. అవి మహిళలకు ప్రేరణ కలిగిస్తాయి. అలాంటి క్యారెక్టర్ల కోసం నా పక్కటెముకలు తొలగించుకోవడం అనేది నేను సాధించే లక్ష్యానికి ఓ ముందడుగు” అని పిక్సీ వివరించింది.

Pixee Fox Cartoon

Pixee Fox Cartoon

హూ ఫ్రేమ్డ్ రోజర్ రాబిట్‌లోని జెస్సికా రాబిట్, స్లీపింగ్ బ్యూటీలోని అరోరా, కూల్ వరల్డ్‌లోని హోలలీ వుడ్ క్యారెక్టర్లంటే తనకు చాలా ఇష్టం అని, వాటిలా కనిపించాలన్నదే తన కోరిక అని పిక్సీ చెప్పింది.

Pixee Fox Waist

Pixee Fox Waist

సన్నడి నడుము కోసం పిక్సీ ఫాక్స్ చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. ఇలాంటి జనాలు కూడా ఉంటారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎవడి పిచ్చి ఆడికి ఆనందం అంటే ఇదే కాబోలు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Pixee Waist

Pixee Waist