porsche car ను పార్కింగ్ చేద్దామనుకున్నాడు..కానీ

  • Published By: madhu ,Published On : November 22, 2020 / 12:47 AM IST
porsche car ను పార్కింగ్ చేద్దామనుకున్నాడు..కానీ

Updated On : November 22, 2020 / 6:59 AM IST

Porsche drives over wall and lands on SUV : Porsche కారును పార్కింగ్ చేద్దామనుకున్నాడు. కానీ ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదానికి గురైన కారు కొత్తదని తెలుస్తోంది. ఈ ఘటన Mannington, Essex లో చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ట్విట్టర్ లో ఓ వ్యక్తి పోస్టు చేసిన వీడియోను 3.5 మిలియన్ల మంది చూశారు. చెత్త పార్కింగ్ అని ఒకరు, ఇతరత్రా కామెంట్స్ చేస్తున్నారు.



Porsche కారును ఓ వ్యక్తి నడుపుకుంటూ..వస్తున్నాడు. కొద్దిగా ఎత్తుగా ఉన్న ప్రదేశంపైకి తీసుకెళ్లి పార్క్ చేద్దామని అనుకున్నాడు. అప్పటికే ఒక కారు, కింద మరొక కారు పార్క్ చేసింది. పైకి వెళ్లిన తర్వాత..కొద్దిసేపు ఆపాడు. అకస్మాత్తుగా ఏమైందో..అమాంతం..కారు వేగంగా ముందుకు దూసుకపోయింది.



ముందున్న కారు ఢీకొని..కిందనున్న మరొక కారుపైకి పడిపోయింది. భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు బయటకు వచ్చి చూశారు. కారుపై మరొక కారు ఉండడం చూశారు. కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు వెల్లడించారు. కారును తీయడానికి రికవరీ ట్రక్కును తీసుకొచ్చారు.