మేడిన్ USA నా లక్ష్యం : ట్రంప్
అమెరికా పార్లమెంట్ లో జాతిని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు.

అమెరికా పార్లమెంట్ లో జాతిని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు.
వాషింగ్టన్ : అమెరికా పార్లమెంట్ లో జాతిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. షట్ డౌన్ తర్వాత తొలిపారి పార్లమెంట్ లో ఆయన మాట్లాడారు. మేడిన్ యూఎస్ఏ తన లక్ష్యమన్నారు. తాను అధికారంలోకి వచ్చాక అమెరికాలో నిరుద్యోగం తగ్గిందని పేర్కొన్నారు. అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పిండమే తన ప్రథమ కర్తవ్యమని తెలిపారు. మహిళలకు మరిన్ని ఉన్నతస్తాయి పదువులిస్తామని భరోసా కల్పించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికులకు నివాళులర్పించారు.