Putin and Jinping Video Conference : మాస్కోను సందర్శించండి.. చైనా అధ్యక్షుడికి పుతిన్ ఆహ్వానం..

చైనాలో వరుసగా మూడోసారి జీ జిన్‌పింగ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. దీంతో జిన్‌పింగ్‌ను రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అభినందించారు. 2023 సంవత్సరంలో మాస్కోను సందర్శించాలని ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ను పుతిన్ ఆహ్వానించారు.

Putin and Jinping Video Conference : మాస్కోను సందర్శించండి.. చైనా అధ్యక్షుడికి పుతిన్ ఆహ్వానం..

Putin and jinping

Updated On : December 30, 2022 / 7:18 PM IST

Putin and Jinping Video Conference : రష్యా, యుక్రెయిన్ మధ్య 200రోజులకుపైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ సమయంలో ఇరు దేశాల అధ్యక్షులు తమతమ స్నేహపూర్వక దేశాలతో సమావేశాలు అవుతున్నారు. ఇటీవల యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో భేటీ అయ్యాడు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతుంది. శుక్రవారం ఇరుదేశాల అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు విషయాలపై మాట్లాడారు.

Putin Presents Gold Rrings : 8 దేశాల అధ్యక్షులకు బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చిన పుతిన్

చైనాలో వరుసగా మూడోసారి జీ జిన్‌పింగ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. దీంతో జిన్‌పింగ్‌ను రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అభినందించారు. 2023 సంవత్సరంలో మాస్కోను సందర్శించాలని ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ను పుతిన్ ఆహ్వానించారు. అదేవిధంగా పుతిన్ తన మాట్లాలో జిన్‌పింగ్‌ను తన ప్రియమైన స్నేహితుడిగా పిలిచాడు. అనంతరం పుతిన్ మాట్లాడుతూ.. రష్యా, చైనా సంబంధాల్లో మరింత సుస్థిరత తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ఒకరికొకరు సహాయం చేసుకుంటామని చెప్పారు.

Russia President Putin: యుక్రెయిన్‌పై యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది.? క్లారిటీ ఇచ్చిన పుతిన్

చైనాకు చమురు, గ్యాస్ సరఫరా చేసే ప్రధాన దేశాల్లో రష్యా ఒకటి అని, 2022 సంవత్సరంలో పవర్ ఆఫ్ సైబీరియా పైప్‌లైన్ సహాయంతో 11 నెలల్లో రష్యా 13.8 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను చైనాకు పంపించడం జరిగిందని పుతిన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న సంబంధాలను మరింత బలోపేతం చేయాలని, ఒకరికొకరు మరింత స్నేహపూర్వకంగా ముందుకు సాగాలని ఇరు దేశాల అధ్యక్షులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.