హ్యారీ గురించి విని కుటుంబమంతా బాధపడుతోంది: క్వీన్ ఎలిజబెత్
జాత్యాహంకార వేధింపులను ఎదుర్కొన్నట్టు మేఘన్ మార్కెల్ చేసిన వ్యాఖ్యలపై ఎలిజిబెత్ రాణి-2 స్పందించారు. రాజకుటుంబంలో ఉన్నప్పుడు తన మనవడు హ్యారీ, ఆయన భార్య గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

HARRY MEGHAN QUEEN
Harry-Meghan Racism: జాత్యాహంకార వేధింపులను ఎదుర్కొన్నట్టు మేఘన్ మార్కెల్ చేసిన వ్యాఖ్యలపై ఎలిజిబెత్ రాణి-2 స్పందించారు. రాజకుటుంబంలో ఉన్నప్పుడు తన మనవడు హ్యారీ, ఆయన భార్య గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘హ్యారీ, మేఘన్‌లకు కొన్ని సంవత్సరాలుగా పరిస్థితులు ఎంత సవాల్‌గా మారిపోయాయో.. తెలుసుకున్నామని మొత్తం కుటుంబమంతా బాధపడినట్లు’ ఓ ప్రకటన విడుదల చేసింది.
‘ముఖ్యంగా జాత్యాహంకార అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. చాలా తీవ్రంగా పరిగణించి.. కుటుంబంలో అంతరంగికంగా చర్చించి పరిష్కరిస్తాం’ అని పేర్కొన్నారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా.. హ్యారీ, మేఘన్, వారి కుమారుడు అర్చీలను ఎప్పుడూ ఫ్యామిలీ పర్సన్లుగా ప్రేమిస్తూనే ఉంటామని తెలిపారు.
హ్యారీ, మేఘన్ చేసిన వ్యాఖ్యలు బ్రిటీష్ రాజకుటుంబం దేశ అత్యంత గౌరవనీయంగా భావించే సంస్థలపై పేల్చిన బాంబుగా పోల్చి చెబుతున్నారు. ప్యాలెస్‌లో గడిపిన సమయంలో నిరాదరణకు గురయ్యారని, ఒక్కోదశలో ఆత్మహత్య చేసుకోవాలనేంత ఒత్తిడిగా అనిపించేదని మేఘన్ తెలిపారు. తమకు పుట్టబోయే బిడ్డ నల్లగా ఉంటాడేమోనని రాజకుటుంబీకులు ఆందోళనపడిన విషయం తెలిసి బాధపడ్డాడనని వివరించారు. ఒకవేళ బిడ్డ నల్లగా పుడితే తనకు ఆస్తిలో హక్కుగా రావాల్సిన వాటా రాదని హ్యారీ చెప్పినట్లు మేఘన్ వెల్లడించింది.
తనరాకతో రాజకుటుంబం చాలా ఇబ్బందుల్లో పడుతోందంటూ పలు పత్రికలు వరుస కథనాలు ప్రచురించాయి. దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. అదంతా అవాస్తవం. తననే రాజకుటుంబం చాలా ఇబ్బందులకు గురిచేసిందని చెప్పుకొచ్చింది మేఘన్. ఈ ఇంటర్వ్యూలో హ్యారీ దంపతులు వెల్లడించిన విషయాలు సంచలనాన్ని రేపాయి. హ్యారీ తల్లి ప్రిన్సెస్ డయానా మరణం తర్వాత ఈ ఇంటర్వ్యూనే రాచకుటుంబాన్ని ఇరుకునపడేసింది.
ఓప్రా విన్‌ఫ్రేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజు హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు వెల్లడించిన విషయాలు యావత్తు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. బ్రిటిష్ రాజ కుటుంబంలోనూ ప్రకంపనలు రేగడానికి కారణమయ్యాయి.