ఉక్కు భారత్ : జపాన్‌ను వెనక్కు నెట్టేసింది

ఉక్కు తయారీలో భారత్ అరుదైన ఘనత
రెండో స్థానంలో ఉండే జపాన్ ను వెనక్కు నెట్టిన భారత్
రెండో స్థానాన్ని సాధించిన భారత్
ప్రస్తుతం మూడోస్థానంలో జపాన్
ప్రపంచంలోనే ముడి ఉక్కు తయారీలో చైనా అగ్రస్థానం
నాలుగో స్థానంలో అమెరికా
ఢిల్లీ : ఏదైనా బ్రాండ్ పేరు చెప్పాలంటే ముందుగా గుర్తుకొచ్చేది జపాన్. మేడిన్ జపాన్ అంటే పెద్ద గొప్పగా చెప్పుకుంటాం. కానీ అంతటి జపాన్ ను భారతదేశం వెనక్కు నెట్టేసి మరో మరో అరుదైన ఘనత సాధించింది. స్టీల్ (ఉక్కు) తయారీలో భారతదేశంతో దూసుకెళుతోంది. రా స్టీల్ (ముడి ఉక్కు) తయారీలో జపాన్‌ను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి దేశంగా భారత్ అవతరించింది. ఈ విషయాన్ని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ తాజా నివేదికలో స్వయంగా వెల్లడించింది.
2018 భారత్‌లో ముడి ఉక్కు ఉత్పత్తి 4.9 శాతంగా ఉండగా అది 106.5 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. 2017లో ఈ ఉత్పత్తి 101.5 మెట్రిక్ టన్నులుగా నమోదైంది. అదే జపాన్ లో ముడి ఉక్కు ఉత్పత్తి 2018లో 2017తో పోలిస్తే 0.3 శాతానికి పడిపోయింది. అంటే 104.3 మెట్రిక్ టన్నులకు తగ్గిందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ వెల్లడించింది.
స్టీల్ ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 2018లో చైనాలో ఉక్కు ఉత్పత్తి అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6.6 శాతం పెరిగి 928.3 మెట్రిక్ టన్నులకు పెరిగింది. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. ప్రపంచ ముడి ఉక్కు ఉత్పత్తిలో చైనా వాటా 2017 నుంచి 2018 వచ్చేసరికి 50.3 నుంచి 51.3 శాతానికి పెరిగింది. గతేడాదిలో 86.7 మెట్రిక్ టన్నుల ముడి ఉక్కును తయారుచేసిన అమెరికా ఈ జాబితాలో 4వ స్ధానంలో నిలిచింది. ఇక టాప్-10లో వరుసగా దక్షిణ కొరియా, రష్యా, జర్మనీ, టర్కీ, బ్రెజిల్, ఇరాన్‌లకు చోటుదక్కింది.