సమాధులు తవ్వండి, గంటకు రూ.400 ఇస్తాం, ఖైదీలకు ప్రభుత్వం ఆఫర్
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఒక్కమాటలో

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఒక్కమాటలో
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే కరోనాకు అమెరికా హాట్ స్పాట్ గా మారిందని చెప్పాలి. అక్కడ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు లక్షల మంది చనిపోతారని అంచనా. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆ రెండు చోట్ల కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా ఉంది. దీంతో అంతా ఆందోళన చెందుతున్నారు.
భారీ సంఖ్యలో గొయ్యిలు తవ్వకాలు:
ఈ పరిస్థితుల్లో అప్రమత్తమైన న్యూయార్క్ సిటీ అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి పెట్టారు. ఒకేసారి లక్షల సంఖ్యలో ప్రజలు కరోనాతో చనిపోతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మృతదేహాల పూడ్చివేత సమస్యగా మారుతుందని గుర్తించారు. అందుకే వారు ఆ దిశగా చర్యలు చేపట్టారు. పెద్ద సంఖ్యంలో సమాధులు తవ్వించే పనిలో పడ్డారు. ఇందుకోసం రికర్స్ ఐల్యాండ్ లోని(rickers island jail) జైలు ఖైదీలకు న్యూయార్క్ సిటీ అధికారులు ఓ ఆఫర్ ఇచ్చారు. సమాధులు తవ్వేవారికి గంటకు 6 డాలర్లు ఇస్తామన్నారు. దాంతో పాటు వ్యక్తిగత రక్షణ పరికరాలు కూడా ఇస్తామన్నారు. కరోనా బారిన పడకుండా రక్షణ పరికరాలు ఇస్తామన్నారు.
న్యూయార్క్ సిటీలో 38వేల మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు వేలమంది చనిపోయారు. కేసులు, మరణాల సంఖ్య మరింతగా పెరిగే చాన్స్ ఉంది. మృతదేహాల పూడ్చివేతకు హార్ట్ ఐల్యాండ్ లో(hart island) కావాల్సినంత స్థలం ఉంది. అందుకే అక్కడ పెద్ద సంఖ్యలో గొయ్యిలు తవ్వించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖైదీలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హార్ట్ ఐల్యాండ్ లోని ఫ్రెష్ ఎయిర్ లో వారు సురక్షితంగా ఉంటారు. సమాధులు తవ్వేందుకు వచ్చిన వారికి అన్ని రక్షణ పరికరాలు ఇస్తాము. వారు భయపడాల్సిన పని లేదు అని న్యూయార్క్ సిటీ అధికారి ఒకరు తెలిపారు.
ఒక్కరోజే కొత్తగా 65వేలకుపైగా పాజిటివ్ కేసులు:
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వైరస్ విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 12 లక్షల 66వేలు దాటింది. కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం యుద్ధం చేస్తోంది. చైనాలో పురుడుపోసుకున్న ఈ మహమ్మారి.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన ప్రతాపం చూపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 12 లక్షల 66వేలు దాటింది. నిన్న(ఏప్రిల్ 5,2020) ఒక్కరోజే కొత్తగా 65వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 69వేల మందికిపైగా బలైపోయారు. నిన్న ఒక్కరోజే 4వేల మందికిపైగా కరోనా రాకాసి బలి తీసుకుంది. ఇక కరోనా బారినపడ్డ… దాదాపు 2 లక్షల 61వేల మంది కోలుకున్నారు. అయితే మరో 45వేల మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
అమెరికా అల్లకల్లోలం:
కరోనా వైరస్ అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అక్కడ మొత్తం 3 లక్షల 34వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలో 23వేల కేసుల దాకా కొత్తవి నమోదయ్యాయి. అదే సమయంలో అగ్రరాజ్యంలో కోవిడ్ మృతుల సంఖ్య 10వేలకు చేరువలో ఉంది. నిన్న ఒక్కరోజే వెయ్యి మందికిపైగా మరణించారు.
ఇటలీలో కరోనా కరాళ నృత్యం:
ఇటలీలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. కరోనా పంజాకు ఇటలీ దేశం చిగురుటాకులా వణికిపోతోంది. ప్రజలు కరోనా బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు ఇటలీలో 15 వేల 887 మందిని కరోనా బలి తీసుకుంది. నిన్న ఒక్కరోజే దాదాపు 525మంది చనిపోయారు. కరోనా మరణాలు ఇప్పటి వరకు ఇటలీలోనే ఎక్కువగా సంభవించాయి. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య లక్షా 28వేలు దాటింది. నిన్న కొత్తగా మరో 4వేల 300 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇటలీలో ఇప్పటివరకు కరోనా బారినపడి 21వేల మంది కోలుకోగా… మరో 4వేల మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
స్పెయిన్‌లోనూ కరోనా కోరలు:
స్పెయిన్‌లోనూ కరోనా వైరస్ కోరలు చాస్తోంది. కరోనా రాకాసి దాహానికి స్పెయిన్ విలవిలలాడుతోంది. ఇప్పటివరకు స్పెయిన్‌లో లక్షా 30వేల మంది కరోనా బారిన పడ్డారు. నిన్న కొత్తగా 5వేల మందికి ఈ వైరస్ సోకింది. ఇక ఇప్పటివరకు 12వేల 518మంది కరోనాతో చనిపోయారు. నిన్న ఒక్కరోజే 571మంది ఈ వైరస్ తో మరణించారు. ఇటలీ తర్వాత అత్యధిక మరణాలు సంభవించింది స్పెయిన్‌లోనే.
See Also | కరోనా టెర్రర్ వైరస్ : మసీదులో దాక్కున్న తబ్లీగీ జమాత్ సభ్యులు