Russia: ‘ట్రంప్, పుతిన్‌ ఫోనులో మాట్లాడుకోలేదు’ అంటూ అమెరికా మీడియాపై మండిపడ్డ రష్యా

అమెరికా మీడియా సంస్థల విశ్వసనీయతను కూడా డిమిత్రి పెస్కోవ్ ప్రశ్నించారు.

Russia: ‘ట్రంప్, పుతిన్‌ ఫోనులో మాట్లాడుకోలేదు’ అంటూ అమెరికా మీడియాపై మండిపడ్డ రష్యా

Updated On : November 11, 2024 / 6:01 PM IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఫోనులో మాట్లాడుకున్నారని యూఎస్‌ మీడియాలో వచ్చిన కథనాలను క్రెమ్లిన్ కొట్టిపారేసింది. రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు.

“వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణా జరగలేదు… ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం, అవి కల్పించుకుని రాసినవే” అని తేల్చిచెప్పారు. అమెరికా మీడియా సంస్థల విశ్వసనీయతను కూడా డిమిత్రి పెస్కోవ్ ప్రశ్నించారు. అమెరికా మీడియా ఇచ్చే సమాచారంలో నాణ్యత ఏ మేరకు ఉంటుందో ఈ ఉదాహరణ స్పష్టం చేస్తోందని విమర్శించారు.

విశ్వసనీయంగా ఉండే పలు మీడియా సంస్థలు కూడా కొన్నిసార్లు ఇటువంటి సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని అన్నారు. కాగా, ఫ్లోరిడాలోని మార్ ఎ లాగో ఎస్టేట్ నుంచి పుతిన్‌కు ట్రంప్ ఫోన్ చేశారని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన విషయం తెలిసిందే. డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై ట్రంప్‌ రష్యా అధ్యక్షుడికి చేసిన మొదటి కాల్ ఇదని తెలిపింది. దీనిపైనే రష్యా స్పందిస్తూ ఘాటు సమాధానం చెప్పింది.

Rahul Gandhi: అప్పటి నుంచి రాజకీయాల్లో ‘లవ్‌’ అనే పదాన్ని వాడుతున్నాను: రాహుల్ గాంధీ