Rahul Gandhi: అప్పటి నుంచి రాజకీయాల్లో ‘లవ్‌’ అనే పదాన్ని వాడుతున్నాను: రాహుల్ గాంధీ

ఆ పాదయాత్ర ఉద్దేశం రాజకీయమని, కానీ, ఆ పాదయాత్రలో తాను ప్రజలను, అలాగే, ప్రజలు తనను ఆలింగనం చేసుకున్నారని తెలిపారు.

Rahul Gandhi: అప్పటి నుంచి రాజకీయాల్లో ‘లవ్‌’ అనే పదాన్ని వాడుతున్నాను: రాహుల్ గాంధీ

Updated On : November 11, 2024 / 4:26 PM IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌లో తన సోదరి ప్రియాంక గాంధీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను తొలిసారిగా భారత్ జోడో యాత్రకు వెళ్లినప్పుడు అది రాజకీయ పాదయాత్ర కావడంతో కాస్త ఆశ్చర్యపోయానని రాహుల్ గాంధీ అన్నారు. ఆ పాదయాత్ర ఉద్దేశం రాజకీయమని, కానీ, ఆ పాదయాత్రలో తాను ప్రజలను, అలాగే, ప్రజలు తనను ఆలింగనం చేసుకున్నారని తెలిపారు. తాను ఐ లవ్యూ అని చెబితే, ప్రజలు కూడా తనకు ఐ లవ్యూ అని చెప్పేవారని గుర్తుచేసుకున్నారు.

ఇవాళ విమానంలో ఉన్నప్పుడు తాను ఒక విషయాన్ని గుర్తుచేసుకున్నానని, చాలా ఏళ్లుగా రాజకీయాల్లో తాను ‘ప్రేమ’ అనే పదాన్ని ఉపయోగించలేదని రాహుల్ గాంధీ అన్నారు. తాను వయనాడ్‌కి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ‘ప్రేమ’ అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభించానని తెలిపారు.

వయనాడ్ ప్రజలు తనపై ఎంతో ప్రేమ, ఆప్యాయత చూపడం వల్లే తన రాజకీయాలన్నీ మారిపోయాయని తాను గ్రహించానని చెప్పారు. ఈ నియోజక వర్గంలో ప్రజలు తనకు ‘ప్రేమ’ ప్రాధాన్యాన్ని నేర్పించారని, అందుకే ‘ఐ లవ్ వాయనాడ్’ అనే కోట్‌తో చొక్కా ధరించారని తెలిపారు. ద్వేషం, కోపాన్ని ఎదుర్కోవడానికి ఏకైక ఆయుధం ప్రేమ, ఆప్యాయతేనని చెప్పారు.

10 నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందని ఒకాయన మాట్లాడుతున్నారు: రేవంత్ రెడ్డి