Russia Detains IS Suicide Bomber : ఇస్తాంబుల్ వేదికగా భారత్ లో ఆత్మాహుతి దాడికి కుట్ర .. రష్యాలో IS సూసైడ్ బాంబర్ అరెస్ట్
భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థ ఐసిస కుట్ర పన్నింది. ఈ కుట్రను రష్యా భగ్నం చేసింది. ఓసూసైడ్ బాంబర్ ను అరెస్ట్ చేసింది. ఇస్తాంబుల్ వేదికగా భారత్ లో ఆత్మాహుతి దాడి చేయటానికి ఐసిస్ చేసిన ప్లాన్ ను రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్-ఎఫ్ఎస్బీ అధికారులు భగ్నం చేశారు. ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు.

Russia Detains IS Suicide Bomber
Russia detains IS suicide bomber : భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థ ఐసిస కుట్ర పన్నింది. ఈ కుట్రను రష్యా భగ్నం చేసింది. ఓసూసైడ్ బాంబర్ ను అరెస్ట్ చేసింది. ఇస్తాంబుల్ వేదికగా భారత్ లో ఆత్మాహుతి దాడి చేయటానికి ఐసిస్ చేసిన ప్లాన్ ను రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్-ఎఫ్ఎస్బీ అధికారులు భగ్నం చేశారు. ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. సదరు ఉగ్రవాది సెంట్రల్ ఆసియాకు చెందిన వ్యక్తిగా గుర్తించింది రష్యా. సూసైడ్ బాంబుతో భారత్ లో బీజేపీ అగ్రనేతలను టార్గెట్ చేసి ఆత్మాహుతి దాడి చేయటానికి కుట్ర పన్నినట్లుగా గుర్తించారు.
రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్-ఎఫ్ఎస్బీ అధికారులు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థకు చెందిన ఒక ఆత్మాహుతి బాంబర్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆ దేశానికి చెందిన స్పుత్నిక్ వార్తా సంస్థ వెల్లడించింది. భారత్‌లోని ప్రముఖ నాయకుడే లక్ష్యంగా సూసైడ్ బాంబర్ఉగ్రదాడికి కుట్ర పన్నుతున్నట్లు అధికారులు గుర్తించారని కథనం ప్రచురించింది.
స్పుత్నిక్ ప్రసారం చేసిన కథనం ప్రకారం.. రష్యాలో నిషేధించిన ఇస్లామిక్ స్టేట్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారులు గుర్తించి..అదుపులోకి తీసుకున్నారు. సదరు ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతంలోని దేశానికి చెందినవాడని నిర్ధరించారు. టర్కీలో ఆత్మాహుతి బాంబర్‌గా ఐఎస్ నాయకులలో ఒకడు నియమించారని విచారణ ద్వారా తెలుసుకున్నారు. 1967 నాటి చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం మొదటి షెడ్యూల్ ప్రకారం ఇస్లామిక్ స్టేట్‌ను ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా గుర్తించింది భారత ప్రభుత్వం. తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ఐఎస్ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటోందని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. అందుకే అంతర్జాలంపై పటిష్ఠ నిఘాతో ఆ సంస్థ కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సంబంధిత భద్రతా విభాగాలు ప్రయత్నం చేస్తున్నాయి.