Alexei Navalny : రష్యా ప్రతిపక్ష నేతకు 9 ఏళ్ల జైలుశిక్ష..రూ.8.75 లక్షల జరిమానా విధించిన కోర్టు

రష్యా ప్రతిపక్ష నేతకు 9ఏళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు. జైలు శిక్షతో పాటు రూ.8.75 లక్షల జరిమానా కూడా విధించింది.

Alexei Navalny : రష్యా ప్రతిపక్ష నేతకు 9 ఏళ్ల జైలుశిక్ష..రూ.8.75 లక్షల జరిమానా విధించిన కోర్టు

Russia Opposition Leader Alexei Navalny

Updated On : March 23, 2022 / 1:02 PM IST

Alexei Navalny sentenced: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీకి కోర్టు 9 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ. 8.75 లక్షల (1.2 million rubles’ (about $11,500) జరిమానాను విధించింది. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మోసం, కోర్టు ధిక్కరణ అభియోగాలకు సంబంధించిన కేసుల్లో దోషిగా తేలారు. దీంతో అలెక్సీకి స్థానిక కోర్టు ఒకటి మంగళవారం (మార్చి 22,2022) తీర్పునిచ్చింది. కోర్టు తీర్పును నావల్నీ మద్దతుదారులు తీవ్రంగా ఖండించారు.

ఇప్పటికే అలెక్సీ నావల్నీ రష్యా రాజధాని మాస్కోకు తూర్పున ఉన్న జైలులో రెండున్నర సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లే వెసులుబాటు నావెల్నీకి ఉంటుంది. 45 ఏళ్ల నావల్నీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు రాజకీయాల్లో బద్ధ శత్రువు.

ఈ క్రమంలో నావల్నీని ఉద్ధేశ్యపూర్వకంగానే దీర్ఘకాలంపాటు జైలుకు పరిమితం చేయటానికి తప్పుడు అభియోగాలు మోపినట్లు పుతిన్‌ ప్రభుత్వంపై విమర్శలున్నాయి.నావల్నీ ఓ పాత కేసులో పెరోల్‌ నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగాలపై ఇప్పటికే రెండున్నరేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నారు.

తన శిక్షానంతరం పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టేట్‌మెంట్‌లో..నవల్నీ మాట్లాడుతూ..తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ..పుతిన్ వాస్తవానికి భయపడుతున్నారు అని వివమర్శించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన పాలన గురించి రష్యన్ ప్రజలు నిజాన్ని కనుగొంటారని భయపడ్డారని అన్నారు.

శిక్షను ప్రకటించిన తర్వాత నవల్నీ ఇద్దరు న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. నవల్నీ భార్య యులియా కూడా Instagramలో ఒక సందేశాన్ని పోస్ట్ చేసారు. ప్రపంచంలోని నా ప్రియమైన వ్యక్తి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.ఇన్ని సంవత్సరాలుగా నేను మీ గురించి ఎప్పుడు సిగ్గు పడలేదు..గర్వపడుతునే ఉన్నాను అని పోస్ట్ చేశారు.