రిటైర్మెంట్ హోమ్‌లో అగ్ని ప్ర‌మాదం..11 మంది వృద్ధులు సజీవదహనం

రిటైర్మెంట్ హోమ్‌లో అగ్ని ప్ర‌మాదం..11 మంది వృద్ధులు సజీవదహనం

Updated On : December 15, 2020 / 1:06 PM IST

Russia : retirement home fire.. 11 elderly people kills ర‌ష్యాలో అత్యంత తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ వృద్ధాశ్ర‌మంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో..11 మంది సజీవంగా దహనమైపోయారు. బాష్‌కోర్టొస్టాన్ ప్రాంతంలోని ఉర‌ల్ ప‌ర్వ‌త‌శ్రేణుల్లోని ఇష్బుల్డినో గ్రామంలో తెల్లవారుజామున 3 గంటలకు ఓ రిటైర్మెంట్ హోమ్‌లో ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుందని అత్యవసర మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు రిటైర్డ్ హోమ్‌లో వ్యాపించిన మంట‌లు సుమారు మూడు గంట‌ల పాటు ఏకధాటికి ఎగసిపడ్డాయి. అనంతరం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి ఆ మంట‌ల్ని ఆర్పారు.

అయితే ఆ హౌమ్‌‌లో ఉన్న‌వారంతా వృద్ధులు కావ‌డంతో అగ్ని ప్ర‌మాదం వేళ త్వరగా బైటపడలేకపోయారు. దీంతో పాపం ఆ వృద్ధులు మంట‌ల్లో సజీవంగా దహనమైపోయారు. ఈ రిటైర్మెంట్ హౌజ్‌లో న‌లుగురు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ట్లు ర‌ష్యా ఏజెన్సీ ప్ర‌క‌టించింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ మొద‌లుపెట్టిన‌ట్లు ర‌ష్యా అధికారులు వెల్ల‌డించారు.

కాగా ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగింది? అనే విషయంపై రష్యా ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది.