Russia: క్యాన్సర్ వ్యాక్సిన్‌పై రష్యా కీలక ప్రకటన.. వచ్చే ఏడాది నుంచి ఉచితంగా టీకా..!
రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ టీఏఎస్ఎస్ సోమవారం నిర్వహించిన ఇంటర్వ్యూలో రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో కీలక విషయాన్ని వెల్లడించారు.

Vaccine
Russia cancer Vaccine: నేడు ప్రపంచం మొత్తాన్ని క్యాన్సర్ మహమ్మారి తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో యావత్ ప్రపంచానికి ఉపశమనం కలిగించేలా రష్యా కీలక ప్రకటన చేసింది. క్యాన్సర్ వ్యాక్సిన్ ను రూపొందించినట్లు రష్యా తెలిపింది. సోమవారం రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో మాట్లాడుతూ.. క్యాన్సర్ నిర్మూలనకు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు. ఇది రష్యాలోని క్యాన్సర్ రోగులకు వచ్చే ఏడాది ఉచితంగా ఇవ్వటం జరుగుతుందని పేర్కొన్నారు.
Also Read: Sunita Williams : ఫిబ్రవరిలో సునీతా విలియమ్స్ భూమికి రిటర్న్ జర్నీ
రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ టీఏఎస్ఎస్ సోమవారం నిర్వహించిన ఇంటర్వ్యూలో రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో కీలక విషయాన్ని వెల్లడించారు. ‘టీకా ఇప్పుడు ప్రిలినికల్ అధ్యయనాల్లో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి మొదటి ఫలితాలను పొందాలని క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని మేము భావిస్తున్నామని చెప్పారు. అనేక మంది శాస్త్రవేత్తల బృందాలు ఈ వ్యాక్సిన్ ను సంయుక్తంగా అభివృద్ధి చేశాయని మురాష్కో చెప్పారు. అయితే, ఈ వ్యాక్సిన్ ఏ విధమైన క్యాన్సర్లను నయం చేస్తుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
Also Read: Jamili elections : జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు నష్టమా?
ఇదిలాఉంటే.. ఈఏడాది ఫిబ్రవరిలో మాస్కోలో భవిష్యత్తు టెక్నాలజీలపై నిర్వహించిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ వ్యాక్సిన్ గురించి చెప్పారు. క్యాన్సర్ కు రష్యా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారని, ప్రస్తుతం టీకా తయారీ కీలక దశలో ఉందని, త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. క్యాన్సర్ వ్యాక్సిన్, రోగనిరోధక శక్తిని పెంచే కొత్త మందు తయారీకి అతి చేరువలో ఉన్నామని, రాబోయే రోజుల్లో వీటిని చికిత్సల్లో ఉపయోగిస్తారని ఆశిస్తున్నానని వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.
ఇప్పటికే పలు దేశాలు వివిధ రకాల క్యాన్సర్లకు టీకాలను తయారు చేస్తున్నాయి. బ్రిటన్ ప్రభుత్వం జర్మనీకి చెందిన బయోఎన్ టెక్ అనే సంస్థతో క్యాన్సర్ వ్యాక్సిన్ కోసం ఒప్పందం చేసుకుంది. 2030 నాటికి పదివేల మంది రోగులకు దీన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.