Ukraine-Russia War: కీవ్ లో వైమానిక దాడి సైరన్‌లు మోగించిన రష్యా, నగరాన్ని వదిలిపోవాలంటూ హెచ్చరికలు

కీవ్ నగరంలో వైమానిక దాడులు చేస్తున్నామని.. ప్రజలు నగరాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ సోమవారం నాడు రష్యా సైనికులు సైరెన్ మోగించారు.

Ukraine-Russia War: కీవ్ లో వైమానిక దాడి సైరన్‌లు మోగించిన రష్యా, నగరాన్ని వదిలిపోవాలంటూ హెచ్చరికలు

Ukriane

Updated On : February 28, 2022 / 5:48 PM IST

Ukraine-Russia War: ఓ వైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు యుక్రెయిన్ పై రష్యా దాడులు ఆగడంలేదు. రష్యా – యుక్రెయిన్ మధ్య పోరు మరింత తీవ్రంగా పరిణమించింది. యుక్రెయిన్ అక్రమణే లక్ష్యంగా రష్యా బలగాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. యుద్ధ నీతిని మరిచి సాధారణ పౌరులపైనా దాడులకు పాల్పడుతుంది రష్యా సైన్యం. రష్యా సైనికుల దాష్టికాలకు సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో విడుదలైన కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. మరోవైపు రష్యా దురాక్రమణను తిప్పికొట్టేందుకు యుక్రెయిన్ సైన్యంతో కలిసి ఆ దేశ పౌరులు సైతం యుద్ధం చేస్తున్నారు. రష్యా సైనికులపై గజిబిజి దాడికి దిగుతూ ఒక్కొక్కరిగా వారిని హతమారుస్తున్నారు. అయితే ప్రతీకారేచ్ఛకు దిగుతున్న రష్యా సైన్యం యుక్రెయిన్ పౌరులకు హెచ్చరికలు చేసింది.

Also read: Ukriane-Russia War: శరణమా? మరణమా? 5300 మంది రష్యా సైనికులు హతమయ్యారు -యుక్రెయిన్ రాయబారి

యుక్రెయిన్ అక్రమణే లక్ష్యంగా ఆ దేశంలోకి అడుగుపెట్టిన రష్యా సైన్యం.. ప్రధాన నగరాలను ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని కీవ్ సహా, అతిపెద్ద నగరాలైన ఖార్కివ్, మారియుపోల్, ఒడెస్సాలను రష్యా సైన్యం ఆక్రమించుకుంది. అయితే ఆ నగరాల్లో యుక్రెయిన్ సైన్యంతో పాటు.. ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు రష్యా సైనికులు. దీంతో ఆయా నగరాల్లో మరింత హింస సృష్టించేలా వైమానిక దాడులకు పాల్పడేందుకు సిద్ధమయ్యారు. కీవ్ నగరంలో వైమానిక దాడులు చేస్తున్నామని.. ప్రజలు నగరాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ సోమవారం నాడు రష్యా సైనికులు సైరెన్ మోగించారు. నగరం మొత్తాన్ని భస్మీపటలం చేయనున్నట్లు రష్యా సైనికాధికారులు కీవ్ ప్రజలను హెచ్చరించారు.

Also read: Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య ఐదో రోజు భీకర పోరు..కీవ్‌ నగరం మా ఆధీనంలోనే ఉందన్న యుక్రెయిన్‌ ఆర్మీ

ఇప్పటికే జరిగిన విధ్వంసంతో కీవ్ నగరంలో అనేక భవంతులు పాక్షికంగా నేలమట్టం అయ్యాయి. నగరంలోని దక్షిణ ప్రాంతంలో ఇంకా కొందరు ప్రజలు నివసిస్తున్నారు. ప్రజలు సమీపంలోని బాంబు షెల్టర్లలో తలదాచుకోవాలని, లేదంటే నగరం నుంచి వెళ్లిపోవాలని రష్యా సైనికులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే..కీవ్ నగరాన్ని రష్యా సైనికులు పూర్తిగా ఆక్రమించుకోవడంతో అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ నగరాన్ని సందర్శించినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు కీవ్ నగరాన్ని ఆక్రమించుకోవాలన్న రష్యా సైనికుల ప్రయత్నాలు విఫలమయ్యాయని యుక్రెయిన్ అధికారులు ప్రకటించారు.

Also read: Russia Ukraine War Day-5 Live Updates : బెలారస్‌లో యుక్రెయిన్-రష్యా మధ్య చర్చలు