Russia-Ukraine war : కీవ్ లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత..రష్యా ఆర్మీని చావు దెబ్బ తీశాం : యుక్రెయిన్
యుక్రెయిన్ రాధాని కీవ్ లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేసామని ప్రభుత్వం వెల్లడించింది...రష్యా ఆర్మీని చావు దెబ్బ తీశామని..యుద్ధంలో నైతిక గెలుపు మాదేననం ధీమా వ్యక్తంచేసింది యుక్రెయిన్.

Removal Of Weekend Curfew In Ukraine Capital City Kiev
Russia-Ukraine war : రష్యా యుక్రెయిన్ పై చేసే యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.యుక్రెయిన్ రాజధాని కీవ్ లో వీకెండ్ కర్ఫ్యూ ను ఎత్తివేస్తున్నామని కీవ్ మా నింయత్రణలోనే ఉందని యుక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. కీవ్ పూర్తిగా ఆక్రమించుకోవాలన్న రష్యా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని రష్యా ఆర్మీ యుక్రెయిన్ చేతిలో చావుదెబ్బద తిన్నదని ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధంలో నైతికంగా విజయం మాదేనని యుక్రెయిన్ ప్రకటించింది. రష్యా సైనికులు యుక్రెయిన్ సైనికులను చూసి భయపడుతున్నారని వెల్లడించింది.
మిలటరీ స్థావరాలతో పాటు సాధారణ ప్రజలు నివాసముండే ప్రాంతాల్లో కూడా రష్యా దాడులు చేసిందని రష్యా ఎన్ని ప్రయత్నాలు చేసినా కీవ్ ను తమను ఏమీ చేయలేకపోయిదని యుక్రెయిన్ రక్షణ మంత్రి అధికారికంగా ప్రకటించారు.మేం చేసిన ఎదురు దాడికి రష్యా మానసిక స్థైర్యంకోల్పోయిందని బలహీన పడింది అని యుక్రెయిన్ తెలిపింది.
కాగా..యుక్రెయిన్ రాధాని కీవ్ లో కర్ఫ్యూ ఎత్తివేయడంతో అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న భారతీయులకు కొంత వెసులుబాటు దొరికింది. దీంతో అక్కడున్న భారతీయులు సులువుగా సరిహద్దు దేశాలకు చేరుకునే వీలు కలిగింది. విద్యార్థులు ప్రయాణించడానికి ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
వీరు ఆ రైళ్లలో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించింది. అయితే విద్యార్థులు పశ్చిమ ప్రాంతంలో ఉన్న రైల్వే స్టేషన్లకు వెళ్లి అక్కడి నుంచి సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవాలని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. సరిహద్దు దేశాలకు చేరుకుంటే అక్కడి నుంచి భారత్ కు సులువుగా చేరుకోవచ్చని సూచించింది.