Vladimir Putin: భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఈ నెలాఖరులోగా ఇండియాలో పర్యటన.. ట్రంప్ టెంపర్ దిగనుందా..

ఇప్పటికే రష్యాలో పర్యటిస్తున్న ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ పుతిన్ పర్యటనను కన్ ఫర్మ్ చేశారు.

Vladimir Putin: భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఈ నెలాఖరులోగా ఇండియాలో పర్యటన.. ట్రంప్ టెంపర్ దిగనుందా..

Updated On : August 7, 2025 / 5:27 PM IST

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు రానున్నారు. ఈ నెల చివరిలో ఆయన ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామంటూ మన దేశంపౌ ట్రంప్ టారిఫ్స్ మోత మోగిస్తున్నారు. 25శాతం టారిఫ్స్ కు అదనంగా మరో 25శాతం టారిఫ్స్ వడ్డించారు. యుక్రెయిన్ పై రష్యా యుద్ధానికి పరోక్షంగా భారత్ మద్దతిస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో పుతిన్ ఇండియా పర్యటనకు రానుండటం ఆసక్తికరంగా
మారింది. ట్రంప్ బెదిరింపుల వేళ ఇండియాకు మద్దతిచ్చేందుకే ట్రంప్ భారత్ వస్తున్నట్లు భావిస్తు్న్నారు నిపుణులు.

పుతిన్ భారత్ పర్యటనతో ట్రంప్ టెంపర్ దిగుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రష్యాలో పర్యటిస్తున్న ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ పుతిన్ పర్యటనను కన్ ఫర్మ్ చేశారు. ఇదే సమయంలో ఈ నెల చివరిన ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్తున్నారు. గాల్వన్ ఘర్షణ తర్వాత భారత ప్రధాని తొలిసారి చైనా టూర్ కి వెళ్తున్నారు. ఈ పర్యటన చైనా, భారత్ మధ్య సఖ్యతను పెంచుతుందనే ఆశాభావం కనిపిస్తోంది. ఇక చైనా, రష్యా, భారత్ మైత్రితో ట్రంప్ కు చుక్కలు తప్పవనే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read: ట్రంప్‌తో భేటీకానున్న రష్యా ప్రెసిడెంట్ పుతిన్.. భారత్‌పై సుంకాలు తగ్గుతాయా.. మీడియా ప్రశ్నకు ట్రంప్ ఏం చెప్పారంటే..?