అమెరికా దాడుల తరువాత ఇరాన్‌‌లోని ఫోర్డో అణుకేంద్రం ఉపగ్రహ చిత్రాలు.. అణుకేంద్రంలో ఆరు రంధ్రాలు

అమెరికా మిలిటరీ దాడుల తరువాత ఇరాన్‌లోని ఫోర్డో అణు‌కేంద్రం ఉపగ్రహ చిత్రాల్లో అక్కడి పరిసర ప్రాతాలు దెబ్బతిన్నాయని చూపిస్తున్నాయి.

అమెరికా దాడుల తరువాత ఇరాన్‌‌లోని ఫోర్డో అణుకేంద్రం ఉపగ్రహ చిత్రాలు.. అణుకేంద్రంలో ఆరు రంధ్రాలు

Satellite images

Updated On : June 23, 2025 / 10:49 AM IST

ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపందాల్చిన క్రమంలో అమెరికా రంగంలోకి దిగింది. ఇరాన్ లోని ఫోర్డోతో పాటు నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై కూడా అమెరికా మిలిటరీ బంకర్ బస్టర్లతో దాడులు చేసింది. అమెరికా దాడుల తరువాత ఇరాన్‌లోని ఫోర్డో అణు‌కేంద్రం ఉపగ్రహ చిత్రాలు, పరిసర ప్రాతాలు దెబ్బతిన్నాయని చూపిస్తున్నాయి.

Also Read: ఇరాన్ మీద అమెరికా వేసిన బాంబు ఇదే.. 13,000 కేజీల బరువు.. భూమి లోపల 200 అడుగుల లోతుకి దూసుకెళ్లి.. అప్పుడు..

పోర్డో అణు కేంద్రం టెహ్రాన్ కు 100 కిలో మీటర్ల దూరం ఉంది. ఇక్కడ వేల వరకు ఐఆర్-1శ్రేణి సెంట్రిప్యూజ్ లు ఉన్నాయి. పౌర, సైనిక అవసరాల కోసం ఇవి యురేనియాన్ని శుద్ధి చేస్తున్నాయి. ఫోర్డో అణు కేంద్రం యూఎస్ దాడితో తీవ్రంగా దెబ్బతిన్నడాన్ని ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి.

ఫోర్డో అణుకేంద్రం భూగర్భంలో ఉండటంతో అమెరికా బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించింది. ఇవి భూమిలోకి దూసుకెళ్లి అణు కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు అమెరికా తెలిపింది. అయితే, ఈ బంకర్ బస్టర్ బాంబులు పర్వతంలోకి చొచ్చుకుపోయినట్లు ఆరు రంధ్రాలు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్నాయి. అలాగే దమ్ముతో మూసుకుపోయిన భూమిని కూడా చూపిస్తున్నాయి.


ఉపగ్రహ చిత్రాలలో నైపుణ్యం కలిగిన పరిశోధకుడు డెక్కర్ ఎవెలెత్ మాట్లాడుతూ.. ఈ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అక్కడ జరిగిన నష్టం స్థాయిని అంచనా వేయడానికి తాము మరింత అధ్యయనం చేయాలని చెప్పారు. ఇదిలాఉంటే.. అమెరికా మిలిటరీ దాడికంటే ముందు ఫోర్డో నుంచి యురేనియం నిల్వలను తరలించి ఉండవచ్చునని ఇజ్రాయెల్ పేర్కొంది. అమెరికా దాడులకు ముందే ఇరాన్ ఫోర్డో ప్లాంట్ నుంచి 400 కేజీల యురేనియం తరలించిందని ఇద్దరు ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నారు.
అయితే, తమ దాడుల్లో నటాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ ప్లాంట్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.