450 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన శనిగ్రహం

వాషింగ్టన్ : సౌరవ్యవస్థలో శనిగ్రహం చుట్టూ ఉండే వలయాలు చాలా ఆలస్యంగా ఏర్పడినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) పంపిన వాహక నౌక కశిని ద్వారా వెల్లడైంది. 1997 నుంచి 2017 వరకు శనిగ్రహం పరిధిలో సంచరించిన అమెరికా-యూరప్ సంయుక్త వాహక నౌక ద్వారా ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మిగతా గ్రహాలతో పాటు శనిగ్రహం సుమారు 450 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తుండగా.. దాని చుట్టూ ఏర్పడిన వలయాలు మాత్రం కోటి నుంచి పదికోట్ల సంవత్సరాల మధ్యలో ఏర్పడినట్లు తాజాగా గుర్తించారు. ఫలితంగా శనిగ్రహం ఏర్పడిన తర్వాత సుమారు 350 కోట్ల సంవత్సరాల పాటు స్వాబావిక వలయాలు లేకుండానే ఉనికి సాగించినట్లు కశని అనే వాహక నౌక ద్వారా తెలిసింది. ఈ వలయాలు శనిగ్రహం పరిధిలో ఉండే ఉపగ్రహాలు ఢీకొనడం లేదా తోక చుక్కల కారణంగా ఏర్పడి ఉండవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.