London Man: భార్య కోసం ప్రకటన.. అరేంజ్‌డ్ మ్యారెజ్ నాకొద్దు.. నన్ను కాపాడండి!
లండన్‌కి చెందిన 29 ఏళ్ల వ్యక్తి భార్య కోసం వెతకడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.

Save me from an arranged marriage
London Man: లండన్‌కి చెందిన 29 ఏళ్ల వ్యక్తి భార్య కోసం వెతకడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అతడు అనుసరించిన మార్గం ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తోంది.
మొహమ్మద్ మాలిక్ అనే వ్యక్తి లండన్, బర్మింగ్‌హామ్‌లోని బిల్‌బోర్డ్‌లపై ప్రకటన ఇవ్వడం ద్వారా తనకు కాబోయే భాగస్వామి కోసం సెర్చ్ చేస్తున్నాడు. బిల్‌బోర్డ్‌లపై రిలాక్స్‌డ్‌గా ఉన్న మాలిక్ చిత్రాన్ని పెట్టి, “పెద్దలు కుదిర్చిన పెళ్లి నుంచి నన్ను రక్షించండి” అంటూ అందులో రాసుకొచ్చారు.
అయితే, పెద్దలు కుదిర్చిన వివాహానికి వ్యతిరేకం కాదని, కానీ, “మొదట నా స్వంత వ్యక్తిని వెతకడానికి ఇష్టపడతానని చెప్పాడు మాలిక్. ‘Findmalikawife.com’ అనే వెబ్‌సైట్‌ను కూడా ఇందుకోసం ఏర్పాటు చేశాడు మాలిక్. భార్య కోసం బర్మింగ్‌హామ్ అంతటా అనేక ప్రకటనల హోర్డింగ్‌లను ఏర్పాటు చేశాడు మాలిక్.
బిల్‌బోర్డ్‌లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పెద్దలు కుదిర్చిన పెళ్లి నుంచి నన్ను కాపాడండి అంటూ సరదాగా అడుగుతున్నట్టుగానే.. మాలిక్ నవ్వుతూ ఉండే ఫోటోను పెట్టారు. ఇంకా సరైన అమ్మాయి దొరకలేదు. నాకు నచ్చేలా అమ్మాయిని కనిపెట్టడం కష్టంగా ఉంది. అని అందులో రాసుకొచ్చాడు.