Pure Gold: చెత్తను తిని స్వచ్ఛమైన బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియా.. ఇదెలా సాధ్యం.. దీన్నెవరు కనుగొన్నారంటే..
శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ అరుదైన బ్యాక్టీరియా పేరు కుప్రియోవిడస్ మెటాలీడ్యూరన్స్. శాస్త్రవేత్తలు ముద్దుగా గోల్డ్ పూపింగ్ బ్యాక్టీరియా అని పిలుస్తున్నారు.

Gold Pooping Bacteria
బంగారం.. ప్రస్తుతం ఈ పేరు వింటే దాని ధరలే మన కళ్లముందు కదలాడుతుంటాయి. గతంలో ఎప్పుడూలేనంత స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి. తులం గోల్డ్ రేటు ఏకంగా లక్ష దాటేసింది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలను బంగారం ధర కంగారుపెడుతుంటే.. మరోపక్క చెత్త తిని 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని విసర్జించే బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. శాస్త్రవేత్తలు ఈ అరుదైన బ్యాక్టీరియాను గుర్తించారు. దీనికి ముద్దు పేరుకూడా ఉంది.
శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ అరుదైన బ్యాక్టీరియా పేరు కుప్రియోవిడస్ మెటాలీడ్యూరన్స్. శాస్త్రవేత్తలు ముద్దుగా గోల్డ్ పూపింగ్ బ్యాక్టీరియా అని పిలుస్తున్నారు. రాగి, ఇతర లోహాలు కలిసిన బంగారం, నికెల్ వంటి వాటిని ఈ బ్యాక్టీరియా తిన్నప్పుడు తన జీర్ణవ్యవస్థలో విడుదలైన ప్రత్యేక ఎంజైముల సాయంతో వాటిని 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా మార్చి విసర్జిస్తుంది. కంటికి కనిపించని ఈ బ్యాక్టీరియా తాలూకు విసర్జితాలు నానోపార్టికల్స్ పరిమాణంలో ఉంటాయి. దీంతో అవి మన కంటికి అసలే కనిపించవు.
దీన్ని ఎవరు కనుగొన్నారు?
ఆస్ట్రేలియా, జర్మనీ శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. ఈ సూక్ష్మజీవి బంగారాన్ని ఎలా తయారు చేస్తుందో వారు కనుగొన్నారు. ఈ బ్యాక్టరీయా తాలూకు విసర్జితాలు మన కళ్లకు కనిపించవు. ఇవి కేవలం నానో పార్టికల్స్ పరిమాణంలో ఉంటాయి. ఇక భూతద్ధంలో పెట్టి చూస్తే గానీ వీటి జాడ మనం కొనుగొనలేము. అయితే, బంగారు గనులు ఉండే చోట- భారలోహాలతో కలుషితమైన నేలని శుభ్రం చేయడానికి ‘బయో మైనింగ్’ పేరుతో ఈ బ్యాక్టీరియాని ఉపయోగించి భూమి కాలుష్యాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారట.
బంగారాన్ని ఎలా ఉత్పత్తి చేస్తాయి..?
కుప్రియావిడస్ మెటాలిడ్యూరాన్స్ అత్యంత నిర్దిష్ట జీవక్రియను కలిగి ఉంది. ఇది విషపూరిత వాతావరణంలో జీవించడానికి వీలు కల్పిస్తుంది. బంగారు అయాన్‌లను కనుగొన్నప్పుడు, ఇది CopA మరియు CupA వంటి ఎంజైమ్‌లను ఏర్పరుస్తుంది. ఈ ఎంజైమ్‌లు లోహ విసర్జన వ్యవస్థలో భాగం. అవి బంగారు అయాన్‌లను తగ్గిస్తాయి. ఇది నానోపార్టికల్స్‌ను ఏర్పరుస్తుంది. ఈ కణాలు సూక్ష్మజీవి నుండి బయటకు విసర్జన చేస్తాయి.
బంగారు మైనింగ్ వల్ల కలిగే నష్టాలను ఎలా నివారిస్తుంది..
ఇప్పటివరకు బంగారు తవ్వకం ఖరీదైనది మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా మంచిది కాదు. ఈ అరుదైన బ్యాక్టీరియా యొక్క శరీరధర్మ శాస్త్రాన్ని అనుకరించడం ద్వారా శాస్త్రవేత్తలు బయోమిమెటిక్ మైనింగ్‌ను అభివృద్ధి చేయవచ్చు. ఆ తరువాత బయో-రియాక్టర్‌లను ఉపయోగించి ఇంజనీర్డ్ సూక్ష్మజీవులను సృష్టించవచ్చు. ఇవి ఇ-వ్యర్థాలు, మైన్ టైలింగ్‌లు లేదా తక్కువ-నాణ్యత గల ఖనిజం నుండి బంగారాన్ని తీయగలవు. తద్వారా పర్యావరణకు కలిగే నష్టాన్ని తగ్గించడమే కాకుండా, సూక్ష్మ జీవి వ్యర్థాలను స్థిరమైన పద్ధతిలో సంపదగా మార్చే బయో-ఎక్స్‌ట్రాక్టింగ్ పరిశ్రమను కూడా ప్రారంభించవచ్చు.