కారులో పేలిన బాంబు : ఏడుగురు మృతి

  • Published By: veegamteam ,Published On : November 13, 2019 / 06:05 AM IST
కారులో పేలిన బాంబు : ఏడుగురు మృతి

Updated On : November 13, 2019 / 6:05 AM IST

ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో బుధవారం (నవంబర్ 13) ఉదయం ఓ కారులో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఉదయం 7:25 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా..మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

పేలుళ్ల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని చేపట్టారు. గాయపడినవారిని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. బాంబు పేలుళ్ల ధాటికి అక్కడున్న కార్లు కూడా ధ్వంసమయ్యాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పేలుడుకు సంబంధించి ఎటువంటి ప్రకటనా ఇప్పటి వరకూ రాలేదు.