Israel : ఇజ్రాయెల్ నుంచి షాకింగ్ వీడియో.. బందీగా కుటుంబం.. కళ్లముందే కూతురికి ఉరి..

అక్క తిరిగి రాదా? పసివాడు గుక్క పెట్టి ఏడుపు.. అక్క స్వర్గంలో ఉంది.. తోబుట్టువు సమాధానం. కూతుర్ని పోగొట్టుకుని మిగిలిన పిల్లల్నికాపాడుకోవాలని తల్లిదండ్రుల ఆవేదన. హమాస్ ఉగ్రవాదులకు బందీలుగా ఉన్న సమయంలో ఓ కుటుంబం పడిన నరకయాతన చూస్తే కన్నీరు ఆపుకోలేం.

Israel : ఇజ్రాయెల్ నుంచి షాకింగ్ వీడియో.. బందీగా కుటుంబం.. కళ్లముందే కూతురికి ఉరి..

Israel

Updated On : October 8, 2023 / 4:54 PM IST

Israel : ఇజ్రాయెల్-పాలస్తీనా దాడుల తర్వాత కొన్ని హృదయ విదారక వీడియోలు వైరల్ అవుతున్నాయి. కళ్లముందే కూతుర్ని హమాస్ ముష్కరులు ఉరివేసారు. ఇద్దరు పసివాళ్లతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఓ ఇజ్రాయిలీ జంట పడిన మానసిక వేదన కన్నీరు తెప్పిస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన జర్నలిస్ట్ ‘ఇండియా నఫ్తాలీ’ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

Actor Nushrratt Bharuccha : ఇజ్రాయెల్ నుంచి ఇండియాకు వచ్చే విమానం ఎక్కిన సినీనటి నుష్రత్

అక్క కావాలి.. అని పసివాడి ఏడుపు
అక్క తిరిగి రాదు.. అని సోదరి సమాధానం
కిడ్నాపర్ ఆమెను స్వర్గానికి తీసుకెళ్లాడు బిడ్డలకు తల్లి సమాధానం
అక్కడ అక్కకి బెటర్‌గా ఉంటుంది అంటూ చిన్న కూతురు సమాధానం
నాన్నా నీ చేతులకు బ్లడ్ ఎందుకు అంటుకుంది కొడుకు గట్టిగా ఏడుపు
ఇదంతా నిజం కాకుండా ఉంటే బాగుండేది.. నేను ఇంకొకరిని కోల్పోవడానికి సిద్ధంగా లేను అంటూ ఆ తల్లి ఏడుపు
వారందరినీ సమాధానం చెప్పలేక చేతి నిండా గాయాలతో ఆ ఇంటి పెద్ద
అంతలో బయట కాల్పుల శబ్దం.. పసివాళ్లు వణికిపోయారు. ఏం జరుగుతోందో తెలియక తల్లడిల్లిపోయారు. హమాస్ టెర్రరిస్టుల దగ్గర బందీలుగా ఉన్న ఓ కుటుంబం తల్లడిల్లిపోయిన వీడియో చూసిన వారిని కన్నీరు పెట్టిస్తోంది.

Israel : ఇజ్రాయెల్ స్డెరోట్‌ పట్టణ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు

హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌లోకి చొరబడి కొందరిని చంపి, కొందరిని బందీలుగా తీసుకెళ్లారు. వారి బారిన పడిన ఓ జంట పెద్ద కుమార్తెను వారి కళ్లముందే ముష్కరులు ఉరి వేసి చంపారు. మరో ఇద్దరు చిన్నారులతో ఆ జంట వారికి బందీ అయ్యారు.  ఏం జరుగుతోందో? ఎందుకు జరుగుతోందో? అర్ధం కాని అయోమయంలో పసిపిల్లలు వణికిపోయారు. గుక్క పెట్టి ఏడ్చారు. బయట కాల్పుల శబ్దం వినిపించిన ప్రతి సారి తమ బిడ్డలను కాపాడుకునేందుకు ఆ జంట తల్లడిల్లిపోయారు. హమాస్ ముష్కరుడు లోనికి వచ్చిన ప్రతి క్షణం హడలిపోయారు. ఆ కుటుంబం మొత్తం అనుభవించిన పరిస్థితి చూస్తే ఎంత క్రూరమైన పరిస్థితుల్ని ఎదుర్కున్నారో కళ్లకు కడుతుంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని గుండె బరువెక్కిపోతుంది.

ఇజ్రాయెల్ కి చెందిన జర్నలిస్ట్ ‘ఇండియా నఫ్తాలీ’ ఈ వీడియోను షేర్ చేసారు. ‘ఇజ్రాయెల్ కుటుంబం హమాస్ ముష్కరులకు బందీలుగా ఉన్నప్పుడు తీసిన వీడియో. వారి కుమార్తె నిర్దాక్షిణ్యంగా ఉరి తీయబడింది. ఆమె తోబుట్టువులను జాలితో వదిలేసారు. ఇది క్రూరత్వానికి పరాకాష్ట. ప్రపంచం కదిలి రావాలి. ఇలాంటి చర్యలను ఆపాలి’ అనే శీర్షికతో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది.