మాకు ప్రశాంతత కావాలి : ఈ హోటల్‌ల్లో మగాళ్లకు నో ఎంట్రీ

ఇదొక విచిత్రమైన హోటల్. ఈ హోటల్ లోకి పురుషులకు ఎంట్రీ లేదు. ఎన్లీ లేడీస్ కు మాత్రమే ఎంట్రీ. ఇదేంటీ ఇటువంటి కండిషన్ ఎక్కడైనా ఉందా? ఉంటుందా? అని ఆశ్చర్యపోవచ్చు. అదంతే..వాళ్లిష్టం. ఒక్క మగ పురుగు వచ్చినా మడతపెట్టేస్తాడు. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందో తెలుసుకోవాలనుందా? స్పెయిన్‌లోని బాలెయారిక్ దీవిలో ఉంది. ఆ హోటల్ పేరు సోమ్ డోనా.
14 ఏళ్లు దాటిన ఆడవాళ్లంతా ఈ హోటల్‌లో ఉండవచ్చు. మగాళ్లకు దూరంగా.. ప్రశాంతంగా ఉండాలని కోరుకునే మహిళలకు మా హోటల్ కరెక్ట్ ప్లేజ్ అంటున్నారు హోటల్ నిర్వాహకులు. ఈ హోటల్‌లో మగాళ్లకు ఎంట్రీ లేదు. కనీసం ఆ పరిసరాల్లోకి కూడా మగాళ్లు అడుగుకూడా పెట్టటానికి వీల్లేకుండా చర్యలు తీసుకున్నారు మేనేజ్ యాజమాన్యం. వారు ఫ్రెండ్స్ అయినా సరే..ఫ్యామిలీ అయినా సరే. నో ఎంట్రీ. అంతే. ఈ హోటల్‌లో మహిళల సేఫ్టీకి ఏమాత్రం ఢోకా లేదంటోంది యాజమాన్యం.
ఏంటీ మెన్స్ నో ఎంట్రీ అంటున్నారు కదా..మరి హోటల్ సిబ్బంది అంతా మహిళలేనా అనుకోవచ్చు. హోటల్ లో అంతా మహిళల్నే సిబ్బందిగా పెట్టుకోవాలని అనుకుంది హోటల్ మేనేజ్ మెంట్. కానీ సాధ్యం కాలేదు. గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఉపాధి కల్పించటంలో వివక్ష ఉండకూడదని నిబంధలు పెట్టింది. అంతా మహిళలే ఉండటం కుదరదు..కొంతమంది పురుషులకు ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వం నిబంధన పెట్టటంతో తప్పని సరి పరిస్థితుల్లో కొందరు పురుషులను నియమించుకుంది. కానీ.. వీరి వల్ల మహిళలకు ఇబ్బంది ఏర్పడకుండా ఉండేందుకు పురుష ఉద్యోగులకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది సోమ్ డోనా హోటల్ మేనేజ్ మెంట్.