Elon Musk: అంతరిక్షంలో అడ్వర్టైజ్‌మెంట్.. ప్లాన్ అదిరింది ఎలన్ మస్క్

ఎటువంటి ప్రొడక్ట్ అయినా సేల్ చేయాలంటే.. మార్కెటింగ్ కావాలి. దాని కోసం ముందుగా అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఇదంతా బిజినెస్ ప్రోసెస్. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎంత కొత్తగా ఉంటే అంత బాగా కస్టమర్లను అట్రాక్ట్ చేయవచ్చు. దానిని బట్టే వ్యాపారం ఎంత మందికి తెలుస్తుందనేది ఆధారపడి ఉంటుంది.

Elon Musk: అంతరిక్షంలో అడ్వర్టైజ్‌మెంట్.. ప్లాన్ అదిరింది ఎలన్ మస్క్

Space X Elon Musk

Updated On : August 10, 2021 / 7:58 PM IST

Elon Musk: ఎటువంటి ప్రొడక్ట్ అయినా సేల్ చేయాలంటే.. మార్కెటింగ్ కావాలి. దాని కోసం ముందుగా అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఇదంతా బిజినెస్ ప్రోసెస్. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎంత కొత్తగా ఉంటే అంత బాగా కస్టమర్లను అట్రాక్ట్ చేయవచ్చు. దానిని బట్టే వ్యాపారం ఎంత మందికి తెలుస్తుందనేది ఆధారపడి ఉంటుంది.

ఒకప్పుడు అడ్వర్‌టైజ్‌మెంట్లను పాంప్లెట్లు.. న్యూస్‌పేపర్లో రూపంలో ప్రచారం చేసేకాలం అయిపోయింది. మారుతున్న కాలంతో పాటు టెక్నికల్‌గా అప్‌డేట్ అయి కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు. డిజిటల్‌ మార్కెటింగ్‌ ద్వారా పలు కంపెనీలు, వ్యాపార సంస్థలు అడ్వర్‌టైజ్ చేస్తున్నాయి.

తాజాగా ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ కంపెనీ అడ్వర్‌టైజింగ్‌ రంగంలో కొత్త శకానికి నాంది పలకనుంది. అంతరిక్షంలోనే అడ్వర్‌టైజ్‌ బిల్‌ బోర్డ్‌లను ఏర్పాటుచేయాలని ప్లాన్ చేశారు. స్పేస్‌ఎక్స్‌ కంపెనీ కెనాడాకు చెందిన స్టార్టప్‌ జియోమెట్రిక్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ (జీఈసీ) భాగస్వామ్యంతో క్యూబ్‌శాట్‌ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. దీంతో ఆయా కంపెనీలు లోగోల గురించి లేదా అడ్వర్‌టైజ్‌మెంట్‌లను అంతరిక్షంలో బిల్‌బోర్డ్స్‌పై కన్పించేలా చేస్తారు.

క్యూబ్‌శాట్‌ శాటిలైట్‌ చూపించే అడ్వర్‌టైజ్‌మెంట్లను యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. క్యూబ్‌సాట్‌కు ప్రత్యేకంగా సెల్ఫీ స్టిక్‌ను ఏర్పాటుచేస్తారు. ఈ మేరకు ఫాల్కన్‌-9 రాకెటును ఉపయోగించి త్వరలోనే శాటిలైట్‌ను ప్రయోగించనుంది స్పేస్‌ ఎక్స్‌.

‘అంతరిక్షంలో అడ్వర్‌టైజ్‌మెంట్‌ చేసుకోవాలనే కంపెనీలు డాగీకాయిన్‌ క్రిప్టోకరెన్సీ ఉపయోగించి కూడా ప్రచారం చేసుకోవచ్చునని తెలిపారు. క్యూబ్‌శాట్‌ ఉపగ్రహంతో అడ్వర్‌టైజింగ్‌ రంగంలో పెనుమార్పులు రానున్నట్లు’ జీఈసీ స్టార్టప్‌ కంపెనీ సీఈవో శామ్యూల్ రీడ్ వెల్లడించారు.