వామ్మో.. లక్ష డాలర్లకు చేరువలో బిట్ కాయిన్.. దీని విలువ ఇంతలా పెరగడానికి అసలు కారణం ఏంటి?

మెరుపు వేగానికి పర్యాయ పదంలా, రాకెట్ స్పీడ్ కు సమానంగా రయ్ రయ్ మని దూసుకుపోతోంది బిట్ కాయిన్ విలువ.

వామ్మో.. లక్ష డాలర్లకు చేరువలో బిట్ కాయిన్.. దీని విలువ ఇంతలా పెరగడానికి అసలు కారణం ఏంటి?

Updated On : November 23, 2024 / 1:20 AM IST

Bitcoin Record Price : కనిపిస్తాయి కానీ కనిపించవు.. డబ్బులు ఉన్నట్లే అనిపిస్తాయి కానీ ఉండవు. చేత్తో తాకలేము, పర్సులో పెట్టుకోలేము. ఒక్క కాయిన్ సంపాదిస్తే, సాధిస్తే లైఫ్ సెటిల్..అంతే.. కన్ఫ్యూజింగ్ గా ఉన్నా క్రిప్టో కరెన్సీ అంటే ఇదే. క్రిప్టో వరల్డ్ లో బిట్ కాయిన్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. వెయ్యి, పది వేలు కాదు ఏకంగా లక్ష డాలర్లకు చేరింది ఒక్క బిట్ కాయిన్ వ్యాల్యూ. అసలేంటి బిట్ కాయిన్.. వెయ్యి డాలర్లతో మొదలై ఇప్పుడు లక్ష దగ్గరకు ఎలా వచ్చింది? రెండు వారాల్లో ఈ స్థాయిలో పెరగడానికి అసలు కారణం ఏంటి? ట్రంప్ గెలుపుతో బిట్ కాయిన్ కు అడ్డు లేకుండా పోయిందా?

బిట్ కాయిన్ విలువ ఓ మధ్య తరగతి కుటుంబం కట్టుకునే ఇల్లుకు, సగటు మనిషి జీవిత కాలపు సేవింగ్స్ కు సమానమైంది. బిట్ కాయిన్ వ్యాల్యూ 98వేల డాలర్లు దాటింది. అంటే మన కరెన్సీలో 83 లక్షల రూపాయలకు పైనే. క్రిప్టో కరెన్సీ వరల్డ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయ్యింది. బిట్ కాయిన్ వ్యాల్యూ లక్ష డాలర్లకు చేరువైంది. మరే కరెన్సీకి సాధ్యం కాని లెవెల్ లో ఎగబాకుతోంది. 16ఏళ్ల కింద వెయ్యి డాలర్లతో మొదలైన బిట్ కాయిన్ ప్రస్థానం ఇప్పుడు ఏకంగా లక్ష డాలర్లకు చేరువైంది. నిజానికి ఐదేళ్ల ముందు కూడా బిట్ కాయిన్ విలువ 5వేల డాలర్లే. జెట్ స్పీడ్ అంటే ఏంటో ఆ తర్వాత పరిచయం చేసింది. ఇప్పుడు లక్ష డాలర్లకు చేరువైంది.

మెరుపు వేగానికి పర్యాయ పదంలా, రాకెట్ స్పీడ్ కు సమానంగా రయ్ రయ్ మని దూసుకుపోతోంది బిట్ కాయిన్ విలువ. నవంబర్ స్టార్టింగ్ లో పెరగాలా వద్ద అన్నట్లుగా కనిపించిన బిట్ కాయిన్.. యూఎస్ లో ట్రంప్ గెలిచాక ఒక్కసారిగా ఆకాశానికి చేరిపోయింది. అధ్యక్ష ఎన్నికలకు ఒక్క రోజు ముందే అంటే నవంబర్ 4న 67వేల డాలర్లకు అటు ఇటుగా ఉన్న బిట్ కాయిన్ విలువ.. ఈ 20 రోజుల్లో 98వేల డాలర్లు దాటింది. ఏడాది చివరికి లక్ష డాలర్లు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇన్వెస్టర్లకు బిట్ కాయిన్ లాభాల వర్షం కురిపిస్తోంది. డిజిటల్ అసెట్స్ పై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతోంది. దీంత్ బిట్ కాయిన్ దూసుకుపోతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత క్రిప్టో అసెట్స్ లో జోష్ పెరిగింది. త్వరలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో పాటు క్రిప్టో అసెట్స్ కు సపోర్ట్ గా ఉండే చాలామంది సభ్యులు అమెరికా చట్ట సభలోకి అడుగు పెట్టబోతున్నారు. దీంతో క్రిప్టో కరెన్సీకి, లావాదేవీలకు అమెరికా ప్రభుత్వం అనుకూలంగా, అండగా ఉంటుందనే అంచనాలతో క్రిప్టో కరెన్సీ మరీ ముఖ్యంగా బిట్ కాయిన్ వ్యాల్యూ పెరుగుతోందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

పూర్తి వివరాలు..

Also Read : అసలేంటి బిట్ కాయిన్? దీన్ని సాధించడం ఎలా? ఇందులో పెట్టుబడులు పెట్టడం సేఫేనా..