Hush Money Case : హష్ మనీ కేసులో ఏం జరగబోతోంది? ట్రంప్‌కు శిక్ష ఖాయమైతే జరిగేది ఏంటి?
ట్రంప్ పొలిటికల్ కెరీర్ లో హష్ మనీ ఓ మరకలా మిగిలిపోవడం ఖాయమా? అమెరికా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ఏంటి?

Hush Money Case : ట్రంప్ నకు కేసులు, వివాదాలు కొత్తేమీ కాదు. అయితే ఓ కేసు మాత్రం కొత్త చర్చకు దారితీస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా వైట్ హౌస్ లో అడుగు పెట్టడానికి పది రోజుల ముందు ఓ కీలక కేసులో తీర్పు రాబోతోంది. తీర్పు ఇప్పటికే ఫిక్స్ అయ్యింది కూడా. ఏం చేస్తాం, ఎలా చేస్తాం అన్న దానికి పై జడ్జి ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ ఏంటా కేసు? ఈ వ్యవహారంలో ట్రంప్ నకు షాక్ తప్పదా? ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ఆసక్తి ఏంటి?
ఇది ట్రంప్ ను జీవితాంతం వెంటాడే అవకాశం ఉంటుంది…
శిక్ష పడుతుంది. కానీ, జైలుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇదీ.. కోర్టు చెబుతున్న మాట. అయితే, ఇది ట్రంప్ ను జీవితాంతం వెంటాడే అవకాశం ఉంటుంది. మరిప్పుడు ఈ కేసుపై ఆయన ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది. అసలు హష్ మనీ కేసు ఏంటి? ట్రంప్ దోషి అని ఎలా తేల్చింది? ట్రంప్ పొలిటికల్ కెరీర్ లో హష్ మనీ ఓ మరకలా మిగిలిపోవడం ఖాయమా? అమెరికా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ఏంటి?

Donald Trump
ట్రంప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు..
హష్ మనీ కేసు ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల కిందట జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత ట్రంప్ మీద విచారణ జరగ్గా.. కోర్టు దోషిగా తేల్చింది. అడల్ట్ ఫిలిం స్టార్ స్టార్మీ డేనియల్ కు డబ్బు చెల్లించిన ఘటనలో వ్యాపార రికార్డులను తప్పుగా చూపినట్లు ట్రంప్ పై ఆరోపణలు ఉన్నాయి. 2006లో స్టార్మీ డేనియల్స్ ను ట్రంప్ లైంగికంగా వేధించారని, 2016 ఎన్నికల సమయంలో ఆమెను అడ్డుకునేందుకు డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read : చైనాను వణికిస్తోన్న హెచ్ఎంపీవీ.. ఇది కొత్త వైరస్ కాదా? కోవిడ్-19 పోలి ఉందా? ఏదైనా వ్యాక్సిన్ ఉందా?!
ఎన్నికల ప్రచారం కోసం సేకరించిన విరాళాల నుంచి సొమ్ము చెల్లించారని అభియోగం..
ఎన్నికల ప్రచారం కోసం సేకరించిన విరాళాల నుంచి సొమ్ము చెల్లించారని, ఈ విషయం బయటపడకుండా రికార్డులను కుట్ర చేశారన్నది ప్రధాన అభియోగం. దీన్నే హష్ మనీ కేసుగా పిలుస్తారు. తన లాయర్ ద్వారా స్టార్మీకి 1.30 లక్షల డాలర్ల హష్ మనీని ట్రంప్ ఇప్పించారు అనేది ఆరోపణ. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి.
ట్రంప్ పై అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ సక్సెస్ అయ్యింది. 6 వారాల విచారణ తర్వాత ట్రంప్ పై మోపిన అభియోగాలన్నీ నిజమే అని, 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఆ మధ్య తీర్పు వెలువరించింది. ట్రంప్ తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డేనియల్స్ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమెతో సహా మొత్తం 22 మందిని సాక్షులను కోర్టు విచారించింది. అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనను దోషిగా ప్రకటించొద్దని ట్రంప్ కోరారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తనకు హాని చేసేందుకే ఈ కేసును తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
పూర్తి వివరాలు..
Also Read : చైనాలో విజృంభిస్తోన్న HMPV వైరస్.. కోవిడ్ మహమ్మారి 2.0గా మారబోతుందా? ఈ 11 వ్యాధులపై వైద్యుల హెచ్చరిక!