శ్రీలంకలో పేలుళ్లు : ముగ్గురు భారతీయులు మృతి

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్లలో 215మంది చనిపోయారు. మృతుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. బాంబు పేలుళ్ల మృతుల్లో ముగ్గురు భారతీయులు

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 03:20 PM IST
శ్రీలంకలో పేలుళ్లు : ముగ్గురు భారతీయులు మృతి

Updated On : April 21, 2019 / 3:20 PM IST

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్లలో 215మంది చనిపోయారు. మృతుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. బాంబు పేలుళ్ల మృతుల్లో ముగ్గురు భారతీయులు

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్లలో 215మంది చనిపోయారు. మృతుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. బాంబు పేలుళ్ల మృతుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నట్టు కొలంబోలోని భారత హై కమిషన్ కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. మృతుల పేర్లను కూడా ప్రకటించారు. మృతులను లక్ష్మీ, నారాయణ్ చంద్రశేఖర్, రమేష్ లు గా గుర్తించారు.

శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం(ఏప్రిల్ 21,2019) వరుస బాంబు పేలుళ్లు జ‌రిగాయి. ఈస్టర్ పర్వదినాన చర్చిలు, హోటళ్లు టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. పేలుళ్లలో 217మంది చనిపోయారు. 600మంది గాయపడ్డారు. సూసైడ్ బాంబ‌ర్లే ఈ మార‌ణ‌హోమానికి పాల్ప‌డిన‌ట్లు ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. కొలంబోలోని షాంగ్రిలా హోట‌ల్‌లో ఏప్రిల్ 20న ఇద్ద‌రు వ్య‌క్తులు ఓ రూమ్ బుక్ చేసుకున్నారు. వారు రూమ్ నెంబ‌ర్ 616లోకి చెకిన్ అయ్యారు. హోట‌ల్‌లోని సీసీటీవీ దృశ్యాల ప్ర‌కారం.. ఆ ఇద్దరు అనుమానితులు సూసైడ్ దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. షాంగ్రిలా హోట‌ల్‌లోని కాఫిటేరియా, కారిడ‌ర్ దగ్గర వాళ్లు త‌మ‌ను తాము పేల్చుకున్నారు. పేలుళ్ల కోసం సీ-4 ఎక్స్ ప్లోజివ్స్ ను వాడిన‌ట్లు తెలుస్తోంది. ఆ హోట‌ల్‌ను పేల్చేందుకు 25 కిలోల బాంబులు వాడినట్టు గుర్తించారు. సూసైడ్ బాంబ‌ర్లు.. ఇస్లామిక్ తీవ్ర‌వాదులుగా అంచ‌నాకు వ‌చ్చారు. వాళ్లు స్థానికులా లేక విదేశీయులా అన్నది తెలియాల్సి ఉంది.