Burqa ban In Sri Lanka : బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడాన్ని నిషేధిస్తూ చట్టం

శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడాన్ని నిషేధిస్తూ శ్రీలంక మంత్రిమండలి తీర్మానించింది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Burqa ban In Sri Lanka : బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడాన్ని నిషేధిస్తూ చట్టం

Burqa Ban In Sri Lanka

Updated On : April 28, 2021 / 11:02 AM IST

Sri Lanka announces burqa ban : శ్రీలంక ప్రభుత్వం ముస్లిం మహిళల విషయంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడాన్ని నిషేధిస్తూ శ్రీలంక మంత్రిమండలి తీర్మానించింది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో ఈస్టర్ రోజున నేషనల్ తావీద్ జమాత్ ఆత్మాహుతి దళానికి చెందిన 9 మంది ఉగ్రవాదులు బురఖా ధరించి చర్చ్‌లు, హోటళ్లపై పేలుళ్లకు తెగబడిన విషయం తెలిసింది. ఈ ఘెరకలి ఒక్క శ్రీలంకనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. శ్రీలంకలో జరిగిన ఈ వరస దాడుల్లో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 500 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారు.

ఈ పరిస్థిలుల్లో జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకున్న లంక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే ముసుగులు ధరించరాదని తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం (ఏఫ్రిల్ 27,2021)న మంత్రి మండలి ఆమోదించింది. కేబినెట్ నిర్ణయాన్ని పార్లమెంటు ఆమోదించిన వెంటనే చట్టంగా మారుతుంది. ఈ విషయాన్ని కేబినెట్ ప్రతినిథి రాంబుక్వెల్లా మీడియాకు తెలిపారు. అయితే, కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించడంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.