Young Man Hangs With Kite : గాలిపటంతో ఎగిరిన యువకుడు
శ్రీలంకలోని జాఫ్నాలో అనూహ్యం సంఘటన చోటు చేసుకుంది. జాఫ్నాలోని పాయింట్ పెడ్రోలో కొంతమంది యువకులు పెద్ద గాలిపటం ఎగరేయాలని సంకల్పించారు.

Srilankan Young Man Hang With Kite
Young Man Hangs With Kite : శ్రీలంకలోని జాఫ్నాలో అనూహ్యం సంఘటన చోటు చేసుకుంది. జాఫ్నాలోని పాయింట్ పెడ్రోలో కొంతమంది యువకులు పెద్ద గాలిపటం ఎగరేయాలని సంకల్పించారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని సిధ్దమయ్యారు. దానికి బలమైన తాడు కట్టారు. గాలిపటం కూడా సుమారు ఆరు అడుగుల పొడవు, వెడల్పు ఉండేలా తయారు చేసి రెడీ చేసారు.
విశాలమైన పంట పొలాల మధ్య గాలిపటాన్ని పైకి ఎగరవేసారు. గాలి ఎక్కువగా వీచటంతో గాలిపటం ఆకాశంలోకి లేచింది. దాన్ని అదుపులోకి ఉంచుకోటానికి కొంతమంది యువకులు గాలిపటానికి కట్టిన తాడును కిందికు దించసాగారు. గాలివేగానికి అది మరింత పైకి వెళ్లటంతో అందరూ తాడు వదిలేశారు.
Also Read : Omicron Threat : ఒమిక్రాన్ ఎఫెక్ట్ – క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు
కానీ ఒక యువకుడు దాన్నే పట్టుకుని ఉండటంతో ఒక్కసారిగా గాల్లోకి లేచాడు. ఒక నొక సమయంలో అతను భూమి నుంచి 70 అడుగుల ఎత్తుకు వెళ్లాడు. అయినా పట్టుకున్న తాడు వదిలి పెట్టలేదు. కొద్ది సేపట్లో గాలి వేగం తగ్గటంతో అతను 30 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకేశాడు. కాగా ఈ ఘటనలో అతనికి స్వల్ప గాయాలవటంతో స్ధానిక ఆస్పత్రిలే చేరి చికిత్స పొందటంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.