కాలిఫోర్నియాలో కార్చిచ్చు…ఎమర్జెన్సీ విధింపు

  • Published By: venkaiahnaidu ,Published On : October 28, 2019 / 02:49 AM IST
కాలిఫోర్నియాలో కార్చిచ్చు…ఎమర్జెన్సీ విధింపు

Updated On : October 28, 2019 / 2:49 AM IST

అమెరికాలోని కాలిఫోర్నియాను కార్చిచ్చు చుట్టిముట్టింది. నివాసాలతో సహా పలు కట్టడాలు మంటల్లో కాలిపోయాయి. విపరీతమైన వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు వీస్తున్నాయి. విపరీతమైన వేడిగాలులకు అగ్గి రాజుకొని వృక్ష సంపదనంతా కబలించేస్తుంది.

ఆదివారం ఓవర్ నైట్ లో 30వేల ఎకరాల వృక్ష సంపద అగ్నికీలల్లో చిక్కుకున్నదని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, అధికారులు మంటలార్పేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాలిఫోర్నియా గవర్నర్ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. 1లక్షా 80వేల మందిని ఇప్పటివరకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు గవర్నర్ తెలిపారు.