Talibans Warn Barbers : గడ్డాలు ట్రిమ్ చేస్తే..చేతులు నరికేస్తాం..బార్బర్లకు తాలిబన్ల వార్నింగ్..
గడ్డాలు ట్రిమ్ చేస్తే..చేతులు నరికేస్తాం..బార్బర్లకు తాలిబన్ల వార్నింగులు ఇచ్చారు. గడ్డం ట్రిమ్ చేయడం అనేది ఇస్లాం చట్టానికి విరుద్ధమని గడ్డాలు ట్రిమ్ చేస్తే..

Talibans Warn Barbers Shaving Beard
Talibans Warn barbers shaving beard : అఫ్గానిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ మార్కు పాలన సాగిస్తున్నారు. ఆడవాళ్లపై అంతులేని ఆంక్షలు, మీడియాకు వార్నింగ్, అమెరికా సేలకు వార్నింగ్,మహిళా క్రీడాకారులకు బెదిరింపులు,ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి సాయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహిన్ వార్నింగ్ ఇలా తాలిబన్లు వార్నింగ్ ల పాలన కొనసాగిస్తున్నారు. ఓ పక్క మేం మారిపోయామని కల్లబొల్లిమాటలు చెబుతునే గతంలో తాము సాగించిన పాలనే కొనసాగుతుందని హెచ్చరికలు ఇస్తున్నారు. బహిరంగ శిక్షలను అమలు చేస్తామని చెబుతున్న తాలిబన్లు తాము మారిపోయామని ప్రజాపాలన చేస్తామని చెబితే ఎవరు నమ్ముతారు? అనే అభిప్రాయాలే వెల్లడవుతున్నాయి.
Read more : Taliban warns India: ఇండియాకు తాలిబన్ల వార్నింగ్
ఈక్రమంలో తాము చెప్పేదే చట్టం..చేసేదే పాలన అంటున్న తాలిబన్లు తాజాగా బార్డర్లకు కూడా వార్నింగ్ ఇచ్చారు. హెయిర్ కట్టింగ్ విషయంలో పాశ్చత్యుల స్టైల్ కటింగ్ లు చేస్తే ఇక మీకు చేతులు లేనట్లే నంటూ వార్నింగ్స్ ఇచ్చారు. అమెరికా హెయిర్ స్టైల్స్ చాలు..గడ్డాలు ట్రిమ్ చేశారో ఇక మీ పని ఖతం అంటూ హెచ్చరికలు జారీ చేశారు బార్బర్లకు..!
హెల్మాండ్ ప్రావిన్స్‌లో క్షురకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. హెల్మాండ్ ప్రావిన్స్‌లో ఇప్పటికే అందరు బార్బర్లకు తాలిబన్లు నోటీసులు పంపించారు. స్థానికులకు గడ్డాలు ట్రిమ్ చేయడం ఆపండి.. లేదంటే శిక్షలు తప్పవు అని హెచ్చరించారు. .గడ్డం ట్రిమ్ చేయడం అనేది ఇస్లాం చట్టానికి విరుద్ధమని కాబట్టి గడ్డాలు ట్రిమ్ చేస్తే మీ కంఠాలు తెగిపోతాయి అనే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు తాలిబన్లు.దీంతో బార్బర్లు వణికిపోతున్నారుఅండర్ కవర్‌లో ఉన్న తాలిబన్లను పంపించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రణాళికలు కూడా వాళ్లు వేస్తున్నారు.
Read more : Sneha Dubey : పాకిస్థాన్.. అబద్దాలు ఇక చాలు..! ఐక్యరాజ్యసమితిలో స్నేహా దూబే వార్నింగ్
అమెరికా స్టైల్స్ హెయిర్ కటింగులు ఇక చాలని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా స్థానిక ఆఫ్ఘన్ యువత సెలూన్లకు వెళ్లి తమకు నచ్చిన స్టైల్స్‌లో హెయిర్‌కట్ చేయించుకోవడం అలవాటు చేసుకున్నారు. కానీ తాలిబన్లు మళ్లీ అధికారంలోకి రావడంతో అక్కడి యువతకు, బార్బర్లకు కష్టాలు మొదలయ్యాయి.అలాగే అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో కూడా తాలిబన్ల బార్బర్లకు ఇదేరకమై ఆదేశాలు జారీ చేశారు.
Read more : Afghanistan: ఆనాటి బహిరంగ కఠిన శిక్షలు మళ్లీ వస్తాయ్ : తాలిబన్లు
తాము మారిపోయామని, గతంలో కంటే భిన్నంగా పరిపాలిస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు ఇలాంటి కఠినమైన ఇస్లామిక్ చట్టాలను వాళ్లు అమలు చేస్తున్నారు.షరియా చట్టాల ప్రకారమే జనాలు ఉండాలని..ముఖ్యంగా మహిళలు తాము చెప్పినట్లే ఉండాలని లేదంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇలా అడుగడుగునా తాలిబన్లు విధించే ఆంక్షల చట్రంలో జీవనం సాగిస్తున్నారు అఫ్గాన్ వాసులు.