కరోనా చికిత్సలో యాంటీ వైరల్ డ్రగ్ remdesivir ట్రయల్ ఫెయిల్.. కొత్త డేటాను పొరపాటున పోస్టు చేసిన WHO

  • Published By: sreehari ,Published On : April 24, 2020 / 03:02 AM IST
కరోనా చికిత్సలో యాంటీ వైరల్ డ్రగ్ remdesivir ట్రయల్ ఫెయిల్.. కొత్త డేటాను పొరపాటున పోస్టు చేసిన WHO

Updated On : April 24, 2020 / 3:02 AM IST

Gilead Sciences అందించే యాంటీ వైరల్ remdesivir‌ మెడిసిన్‌.. కొవిడ్-19 బాధితులకు చికిత్సకు ఇవ్వడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఓ కొత్త డేటాను పొరపాటున పోస్టు చేసింది. కరోనా బాధితులు త్వరగా కోలుకోవడం లేదా మరణించకుండా ఈ మెడిసిన్ వేగంగా అడ్డుకోలేదంటూ అధ్యయనాన్ని బహిర్గతం చేసింది. చైనాలో ఈ అధ్యయానికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా దాని ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. 

ఈలోగా అధ్యయానికి సంబంధించి కొత్త డేటాను WHO పోస్టు చేసింది. పొరపాటును గుర్తించిన వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసింది. ప్రయోగాత్మక యాంటీవైరల్ డ్రగ్ remdesivir‌ కరోనా రోగులకు ఎలాంటి ప్రయోజనం కలిగించలేదని చూపించే అధ్యయన ఫలితాల సారాంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్ అనుకోకుండా పోస్ట్ చేసిందని STAT నివేదించింది. STAT నివేదించిన అధ్యయన ఫలితాల ప్రకారం.. ఒక ప్రముఖ కరోనావైరస్ చికిత్స అభ్యర్థి ప్లేసిబో గ్రూపు కంటే తీవ్రమైన కరోనావైరస్ రోగులపై సమర్థవంతంగా పనిచేయలేదని తెలిపింది. దీనిపై Gilead, WHO ఇప్పటివరకూ స్పందించలేదు. కొత్త డేటాను WHO పోస్టు చేయడంతో గురువారం మధ్యాహ్నం గిలియడ్ స్టాక్ 5.9శాతం ఒక్కసారిగా పడిపోయి 76.51 డాలర్లకు చేరుకుంది.

STAT ప్రకారం.. ప్లేసిబో పొందిన 12.8శాతంతో పోలిస్తే… remdesivir‌ 13.9శాతం మంది రోగులు ఒక నెల ఫాలో-అప్ తర్వాత మరణించారు. ఈ ట్రయల్ ప్రత్యేకించి తీవ్రమైన COVID-19 ఉన్న రోగుల గ్రూపుపై జరిపింది. కొద్ది రోజుల్లో remdesivir‌ డేటా లీక్ కావడం ఇది రెండోసారి. చికాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు మరో remdesivir‌ అధ్యయనం నుండి మంచి ఫలితాలను చర్చిస్తున్నట్లు చూపించిన ఒక వీడియోలో STAT నివేదించింది.