శుభాంశు బృందంతో అంతరిక్షంలోకి నీటి ఎలుగుబంటి.. అరుదైన జీవితో అక్కడ ఎలాంటి పరిశోధనలు చేస్తారు..

భూమి మీద అత్యంత అరుదైన జీవి నీటి ఎలుగుబంటి(టార్డిగ్రేడ్‌).

శుభాంశు బృందంతో అంతరిక్షంలోకి నీటి ఎలుగుబంటి.. అరుదైన జీవితో అక్కడ ఎలాంటి పరిశోధనలు చేస్తారు..

water bears

Updated On : June 25, 2025 / 2:23 PM IST

Shubhanshu Shukla Axiom-4 Launch: భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ఆయనతో కలిసి మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకొని యాక్సియం -4 నింగిలోకి దూసుకెళ్లింది. ప్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా దూసుకెళ్లింది. శుభాంశు శుక్లా బృందంతోపాటు.. నీటి ఎలుగుబంటి (ఎనిమిది కాళ్ల జంతువు) కూడా అంతరిక్షంలోకి వెళ్లింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు చేరుకున్న తరువాత ఈ బృందం పలు పరిశోధనలు చేయనుంది.

నీటి ఎలుగుబంటి అంటే..
భూమి మీద అత్యంత అరుదైన జీవి నీటి ఎలుగుబంటి(టార్డిగ్రేడ్‌). సూక్ష్మ కణజాల జీవిగా పిలిచే నీటి ఎలుగుబంటి భూ మండలంపై జీవించి ఉండే అత్యంత అరుదైన జీవి. 0.3 మి.మీల నుంచి 0.5మి.మీల పొడవు ఉంటుంది. పర్యావరణంలో అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకొని జీవించే డీఎన్ఏను ఈ జీవి కలిగి ఉంటుంది. పర్వతాలు, సముద్రాలు, ఎడారులతోపాటు సూర్యరశ్మి నేరుగా పడే ప్రదేశాల్లోనూ ఈ జీవి జీవించగలదు. దీని శరీరంలోని కణాలకు నీటిని భర్తీ చేసుకునే లక్షణం ఉండటంతో సంవత్సరాలపాటు అదే నీటితో జీవించగలదు.

ఎలాంటి ప్రయోగాలు చేస్తారు..
భూమి మీద అత్యంత అరుదైన జీవిగా భావించే నీటి ఎలుగుబంటి. ఇలాంటి అరుదైన జీవి డీఎన్ఏను ఇస్రో డీకోడ్ చేసింది. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి అతి తక్కువ ఉండే ప్రాంతంలో పునరుత్పత్తిపై పరిశోధన చేస్తుంది. భూమితో పాటు అంతరిక్షంలో వీటి జన్యు మార్పిడి చేసే విషయంపై అధ్యయనం చేస్తుంది. ఈ పరిశోధన ఫలితాలు వ్యోమగాముల రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో సాయపడతాయి. సూర్యరశ్మి విపరీతంగా ఉండే పరిస్థితి, గురుత్వాకర్షణ తక్కువ ఉండే ప్రాంతంలో నీటి ఎలుగుబంటి డీఎన్‌ఏలో కలిగే మార్పులకు తగ్గట్లు వ్యోమగాముల రక్షణ వ్యవస్థలను తయారు చేస్తారు.