బంగారం దుకాణంలోకి అకస్మాత్తుగా వరదలు.. చూస్తుండగానే కొట్టుకుపోయిన 12కోట్ల విలువైన నగలు.. వెతికేందుకు ఎగబడిన జనం.. వీడియో వైరల్

భారీ వర్షాలకు అకస్మాత్తుగా వరద ముంచెత్తడంతో ఓ నగల దుకాణం నుంచి చూస్తుండగానే దాదాపు 20 కిలోల బంగారం నగలు, నగదు కొట్టుకుపోయాయి.

బంగారం దుకాణంలోకి అకస్మాత్తుగా వరదలు.. చూస్తుండగానే కొట్టుకుపోయిన 12కోట్ల విలువైన నగలు.. వెతికేందుకు ఎగబడిన జనం.. వీడియో వైరల్

Shaanxi Province in china

Updated On : July 31, 2025 / 2:08 PM IST

Gold Washed Away in China: చైనాలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అక్కడి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. షాంగ్జీ ప్రావిన్సులోనూ వరదల సంభవించాయి. ఈ ప్రావిన్సులోని వుచి కౌంటీ ప్రాంతం సముద్ర తీరానికి సమీపంలో ఉంటుంది. భారీ వర్షాలకు అకస్మాత్తుగా వరద ముంచెత్తడంతో స్థానికంగా ఉన్న నగల దుకాణం నుంచి చూస్తుండగానే దాదాపు 20 కిలోల బంగారం నగలు, నగదు కొట్టుకుపోయాయి.

Salman Khan: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ ఆస్తులు 100 కోట్లు.. కోటి రూపాయల ఖరీదైన కారు.. ఇంకా..

షాంగ్జీ ప్రావిన్సులోని వుచి కౌంటీలో జులై 25న ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పటిలానే ఉదయం వేళ స్థానికంగా ఉన్న లావోఫెంగ్జియాంగ్ ఆభరణాల దుకాణాన్ని సిబ్బంది తెరిచారు. కొద్దిసేపటి తరువాత చూస్తుండగానే వరదల ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. వరద ఉధృతి పెరగడంతో కళ్లముందే దుకాణంలోని నగలు, సేఫ్ బాక్స్ కొట్టుకుపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు పెద్దెత్తున్న వీధుల్లోకి వచ్చి బంగారం నగల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దాదాపు 20 కిలోల బంగారంతోపాటు నగదు గల్లంతైనట్లు నగల దుకాణం యాజమాని యో తెలిపారు. వీటి విలువ 10 మిలియన్ యువాన్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ. 12కోట్ల పైమాటే) ఉంటుందని వెల్లడించారు. కొట్టుకుపోయిన వాటిల్లో బంగారు హారాలు, గాజులు, ఉంగరాలు, చెవి దుద్దులు, వజ్రపు ఉంగరాలు, వెండి ఆభరణాలు ఉన్నట్లు దుకాణం యాజమాని తెలిపారు. వరదల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో దుకాణంలోని, స్థానికంగా ఉన్న సీసీటీవీ పుటేజీలు కూడా పనిచేయకుండా పోయాయి.

కొంతమంది స్థానికులు దొరికిన నగలను తీసుకొచ్చి యాజమానికి అప్పగించగా.. మరికొందరు ఆభరణాలను తిరిగి ఇవ్వకుండా తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. నగల దుకాణం యాజమాని కుమారుడు జియావోయ్ మాట్లాడుతూ.. నగలు దొరికిన ఎవరైనా దానిని దుకాణానికి తీసుకొచ్చి అప్పగించాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. తిరిగి ఇచ్చిన వారికి బహుమతులు కూడా అందజేస్తామని ప్రకటించారు. ఆభరణాలు దొరికినా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఉంచుకున్నట్లు తెలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జియావోయ్ హెచ్చరించారు.