Sunita Williams: స్పేస్‌వాక్‌ చేయనున్న సునీత విలియమ్స్‌

జనవరి 16న “యూఎస్ స్పేస్‌వాక్ 91” పేరుతో ఓ మిషన్, జనవరి 23న “యూఎస్‌ స్పేస్‌వాక్ 92” పేరుతో ఓ మిషన్‌ను చేపడతారు. 

Astronaut Sunita Williams

నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ స్పేస్‌వాక్‌ చేయనున్నారు. 12 ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ చేయనున్న తొలి స్పేస్‌వాక్ ఇది. నాసా నుంచి విడుదలైన ఓ ప్రకటన ప్రకారం.. సునీత విలియమ్స్‌ న్యూట్రాన్ స్టార్ ఇంటీరియర్ కంపోజిషన్ ఎక్స్‌ప్లోరర్ ఎక్స్-రే టెలిస్కోప్‌ను రిపేర్ చేయాల్సి ఉంది.

ఇందుకోసం ఆమె జనవరి 16న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో తోటి వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి స్పేస్‌వాక్‌ చేస్తారు. అంతేకాదు, జనవరి 23న కూడా ఆమె మరోసారి స్పేస్‌వాక్‌ చేయాల్సి ఉంటుంది. ఐఎస్‌ఎస్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం, సమర్థ నిర్వహణ వంటి పనుల కోసం నాసా ఈ ప్రక్రియను చేయిస్తోంది.

జనవరి 16న “యూఎస్ స్పేస్‌వాక్ 91” పేరుతో ఓ మిషన్, జనవరి 23న “యూఎస్‌ స్పేస్‌వాక్ 92” పేరుతో ఓ మిషన్‌ను నిర్వహిస్తారు. సునీత విలియమ్స్ జనవరి 16న తోటి వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి క్రిటికల్ రేట్ గైరో అసెంబ్లీని రిప్లేస్‌ చేస్తారు. ఇది ఐఎస్‌ఎస్‌ పనితీరును మరింత మెరుగుపర్చడంలో ఉపయోగపడుతుంది.

దీంతో పాటు సునీత, నిక్‌ హేగ్‌ న్యూట్రాన్ స్టార్ ఇంటీరియర్ కంపోజిషన్ ఎక్స్‌ప్లోరర్, ఎక్స్-రే టెలిస్కోప్ లైట్ ఫిల్టర్‌ల పనీతీరును పరిశీలిస్తారు. అలాగే, స్టేషన్ డాకింగ్ అడాప్టర్‌లలో ఒకదానిపై నావిగేషన్ కోసం ఉపయోగించే రిఫ్లెక్టర్ పరికరాన్ని రిప్లేస్‌ చేస్తారు.

ఐఎస్‌ఎస్‌ను భవిష్యత్తులో వాడేందు కోసం ఉపయోగించే ఆల్ఫా మాగ్నెటిక్ స్పెక్ట్రోమీటర్ యాక్సెస్ పాయింట్లను కూడా వారు పరిశీలిస్తారు. కాగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ కొన్ని నెలలుగా అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో వారిద్దరు క్రూ-9 మిషన్‌లో భూమి మీదకు వస్తారు.

Kondapochamma Sagar Dam Incident : పండుగ పూట పెను విషాదం.. కొండపోచమ్మ సాగర్ డ్యామ్ లో ఐదుగురు యువకులు గల్లంతు..