Hend ZaZa: 12 ఏళ్ల బాలిక టోక్యో ఒలింపిక్స్‌కు..రికార్డ్ క్రియేట్ చేసిన హెంద్ జాజా

జపాన్ లో జరుగునున్న ఒలింపిక్స్ క్రీడలకు ఓ చిన్నారి ఎంపిక కావటంతో అందరి దృష్టి ఆమెమీదనే పడింది. ఈ చిన్నారి పేరు ‘హెండ్ జాజా‘. ఆమె వయస్సు కేవలం 12 సంవత్సరాలు. ఒలింపిక్స్‌లో పోటీపడబోతున్న అతి పిన్న వయస్కురాలిగా హెంద్ జాజా అందరి దృష్టిని ఆకర్షించింది.

Hend ZaZa: 12 ఏళ్ల బాలిక టోక్యో ఒలింపిక్స్‌కు..రికార్డ్ క్రియేట్ చేసిన హెంద్ జాజా

Hend Zaza

Updated On : July 13, 2021 / 11:45 AM IST

Tokyo Olympics 12 years Hend ZaZa : ఒలింపిక్స్ లో పాల్గొని పతకం సాధించాలని ప్రతీ క్రీడాకారుడు..క్రీడాకారిణిల ఆకాంక్ష. ఒలింపిక్స్ క్రీడలు వస్తున్నాయంటూ ఐదు ఖండాల క్రీడాకారులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఒలింపిక్స్ కు సెలక్ట్ అవ్వాలని ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ క్రమంలో జపాన్ లో జరుగునున్న ఒలింపిక్స్ క్రీడలకు ఓ చిన్నారి ఎంపిక కావటంతో అందరి దృష్టి ఆమెమీదనే పడింది. ఈ చిన్నారి పేరు ‘హెంద్ జాజా‘. ఆమె వయస్సు కేవలం 12 సంవత్సరాలు. ఒలింపిక్స్‌లో పోటీపడబోతున్న అతి పిన్న వయస్కురాలిగా హెంద్ జాజా అందరి దృష్టిని ఆకర్షించింది.

సిరియాకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి హెంద్ జజా ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 12 ఏళ్ల ఈ చిన్నారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలు కావడం గమనిచాల్సిన విషయం. ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్‌లో ఆమె స్థానం 155. గత ఫిబ్రవరిలో జరిగిన పశ్చిమాసియా టేబుల్ టెన్నిస్ అర్హత టోర్నీలో టైటిల్ సాధించడం ద్వారా ఒలింపిక్స్‌‌లో పాల్గొనే అవకాశాన్ని కొట్టేసింది చిన్నారి హెంద్. అప్పటికి ఆమె వయసు 11 సంవత్సరాలే కావడం గమనార్హం.1968లో జరిగిన యూఎస్ లోని మెక్సికో ఒలింపిక్స్‌లో రొమేనియాకు చెందిన 13 ఏళ్ల ఫిగర్ స్కేటర్ బిట్రీస్ పాల్గొంది. ఆ తర్వాత మళ్లీ ఇంతకాలానికి అంతకంటే చిన్న వయసున్న హెంద్ జాజా టోక్కో ఒలింపిక్స్ లో పోటీపడబోతోంది.