Teacher Viral Video : టీచర్ దుస్తులపై బొమ్మలు గీసిన విద్యార్ధులు.. ఉద్యోగం చివరి రోజు ఆ దుస్తులు ధరించిన టీచర్
స్కూల్ లాస్ట్ డే అనగానే విద్యార్ధుల్లో కనిపించని దిగులు ఎలా ఉంటుందో.. స్కూలుని విడిచిపెడుతుంటే టీచర్లకు అలాగే ఉంటుంది. ఓ స్కూల్ టీచర్ తన జాబ్ చివరి రోజు విద్యార్ధులు పెయింట్ చేసిన డ్రెస్ ధరించి వారికి సర్ప్రైజ్ ఇచ్చింది. వారంతా ఆనందంలో మునిగిపోయారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Teacher Viral Video
Teacher Viral Video : ఉపాధ్యాయులు, విద్యార్ధుల మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఇటీవల కాలంలో వేరే స్కూళ్లకు ట్రాన్స్‌ఫర్ అయి టీచర్లు వెడుతుంటే విద్యార్ధులు కన్నీరు పెట్టుకున్న సంఘటనలు, స్కూలుని విడిచిపెట్టలేక ఉపాధ్యాయులు బాధపడే సంఘటనలు చూస్తున్నాం. ఓ స్కూల్ నుంచి వెళ్లిపోతున్న టీచర్ లాస్ట్ డే విద్యార్ధులను ఏం కోరింది? వారు ఏం చేశారు? బ్యూటిఫుల్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ప్రతి క్లాసులో.. ప్రతి ఉపాధ్యాయుడితో విద్యార్ధులకు కొన్ని మెమరీస్ ఉంటాయి. అవి ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. హీథర్ స్టాన్స్‌బెర్రీ అనే టీచర్ ఉద్యోగం మానేసే ముందు చివరి రోజు ఎప్పటికి గుర్తుండిపోవాలనుకున్నారు. అంతకు ముందే తన దుస్తులపై పెయింట్ చేయాల్సిందిగా ఆమె కొందరు విద్యార్ధుల్ని రిక్వెస్ట్ చేసింది. స్కూలు చివరి రోజు ఆమె క్లాస్ రూంలోకి ఓవర్ కోట్‌తో ప్రవేశించారు. కోట్ తీయగానే విద్యార్ధులంతా ఆశ్చర్యపోయారు. ఆమె కోటు తీయగానే తాము పెయింట్ చేసిన దుస్తులు కనిపించడంతో విద్యార్ధులు ఆనందంలో మునిగిపోయారు. ఈ వీడియోని హీథర్ స్టాన్స్‌బెర్రీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో (heatherstansberryy) షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
Kerala : ఆ స్కూల్లో ఒకే ఒక్క విద్యార్థి .. పాఠాలు చెప్పటానికి 140 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న టీచర్
‘నాకు కొందరు ఉపాధ్యాయులతో మెమరీస్ ఉన్నాయి. ఈ టీచర్ చేసిన పనిని విద్యార్ధులు ఎప్పటికీ మర్చిపోలేరు’ అని ఒకరు..’మంచి మెమరీ.. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారని ఆశిస్తున్నాను’ అంటూ మరొకరు వరుసగా కామెంట్లు పెట్టారు. విద్యార్ధులతో తనకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాల్ని ఆ టీచర్ దుస్తులపై వేసిన బొమ్మల్లో పదిలంగా దాచుకున్నారు.
View this post on Instagram