Student Message Viral : 20 ఏళ్ల తర్వాత స్టూడెంట్ పెట్టిన మెసేజ్ చూసి ఎమోషనలైన టీచర్.. మెసేజ్ లో ఏముందంటే?

మనలో ఉన్న ఇష్టాన్ని, టాలెంట్‌ని మొదటగా ఉపాధ్యాయులు గుర్తిస్తారు. ఆ దిశగా ప్రోత్సహిస్తారు. 20 ఏళ్ల క్రితం టీచర్ చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించాడు. ఆ విషయాన్ని మళ్లీ గురువుకి షేర్ చేసుకున్నాడు ఓ విద్యార్ధి. స్ఫూర్తి కలిగించే పోస్టు చదవండి.

Student Message Viral : 20 ఏళ్ల తర్వాత స్టూడెంట్ పెట్టిన మెసేజ్ చూసి ఎమోషనలైన టీచర్.. మెసేజ్ లో ఏముందంటే?

Student Message Viral

Student Message Viral : స్కూల్ లేదా కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత చాలామంది తమకు విద్య చెప్పిన ఉపాధ్యాయులను , తోటి విద్యార్ధులను గుర్తు పెట్టుకుంటారు. ఎప్పుడైనా రీ-యూనియన్ అయినప్పుడు కలుస్తుంటారు. అయితే ఓ విద్యార్ధి తన టీచర్ కి 20 సంవత్సరాల తర్వాత పెట్టిన మెసేజ్ ఒకటి వైరల్ అవుతోంది. ఆ టీచర్ ఆనందానికి అయితే హద్దుల్లేవు.

Kerala : ఆ స్కూల్లో ఒకే ఒక్క విద్యార్థి .. పాఠాలు చెప్పటానికి 140 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న టీచర్

ప్రతి స్టూడెంట్‌కి టీచర్ ఓ రోల్ మోడల్. అత్యంత ప్రభావితం చేయగల వ్యక్తి. విద్యార్ధులు కనే కలల్ని నిజం చేసుకునే దిశగా ఉపాధ్యాయులు వారికి ప్రేరణ కలిగిస్తారు. అలా మన జీవితంలో ఎన్నో విషయాల్లో మార్గం చూపిన గురువుల్ని తలుచుకుంటాం. 20 సంవత్సరాల తర్వాత ఓల్డ్ స్టూడెంట్ నుంచి అందుకున్న హృదయపూర్వక సందేశాన్ని మార్క్ డెంట్ Mark Dent అనే UK ఉపాధ్యాయుడు ఇంటర్నెట్‌లో షేర్ చేసుకున్నారు. అతని దగ్గర చదువుకున్న ఓ స్టూడెంట్ తన మెసేజ్‌లో థ్యాంక్స్ చెప్పాడు.

 

Cambrai ప్రైమరీ స్కూల్‌లో ఎగ్జిక్యూటివ్ హెడ్‌ టీచర్ మార్క్ డెంట్ తన పాత విద్యార్ధితో జరిగిన సంభాషణను షేర్ చేసుకున్నారు. అందులో ఏముందంటే ‘ 20 సంవత్సరాల క్రితం పేరెంట్స్ మీటింగ్‌లో సైన్స్‌లో ఏదైనా చేయాలని మీరు సూచించారు. మెరైన్ బయాలజీలో పట్టభద్రుడనయ్యాను. GSKలో మైక్రోబయాలజిస్ట్ టెక్నాలజిస్ట్‌గాఈరోజు జాబ్ ఆఫర్ వచ్చింది. నా ఇష్టాన్ని తెలుసుకున్న మొదటి వ్యక్తి మీరే. నా కల నెరవేరడానికి కారణం మీరే. నేను మీకు ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అనే సందేశాన్ని ఆ ఉపాధ్యాయుడు అందుకున్నాడు. ఈ పోస్ట్ చూసిన తరువాత మార్క్ డెంట్  ‘నేను ఎంతో గర్వంగా, ఎమోషనల్‌గా ఫీలయ్యాను. ఇలాంటి రిజల్ట్ కోసమే మేము పనిచేస్తాము’ అనే శీర్షికతో విద్యార్ధి పంపిన స్క్రీన్ షాట్‌ని  షేర్ చేశారు.

Viral Video : అమేజింగ్ టాలెంట్.. డ్యాన్స్ ఇరగదీసిన టీచర్.. వీడియో వైరల్

 

ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘ఇది నిజంగా అద్బుతం.. మీకు ఇంతటి గుర్తింపు రావడం సంతోషంగా ఉంది’ అని ఒకరు.. ‘ఉపాధ్యాయులు నిజంగా హీరోలు.. సమాజం వారికి మరింత గౌరవం ఇవ్వాలి’ అని మరొకరు అభిప్రాయపడ్డారు. టీచర్ చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించడమే కాకుండా ఆ విషయాన్ని మరలా ఆ టీచర్ కి షేర్ చేసిన విద్యార్ధిని తప్పకుండా అభినందించాలి. ఈ పోస్టు చాలామంది స్టూడెంట్స్‌కి స్ఫూర్తి అని చాలామంది ప్రశంసలు కురిపించారు.