అందంగా తయారై ఫొటోలు దిగింది, అయినా లైక్స్ రాలేదని ఆత్మహత్య చేసుకుంది

  • Published By: naveen ,Published On : August 24, 2020 / 04:43 PM IST
అందంగా తయారై ఫొటోలు దిగింది, అయినా లైక్స్ రాలేదని ఆత్మహత్య చేసుకుంది

Updated On : August 24, 2020 / 5:04 PM IST

సోషల్ మీడియా వ్యసనంగా మారుతోంది. వ్యవహారం ఏ రేంజ్ కు వెళ్లిదంటే యువత దారి తప్పుతోంది. కొందరు ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి యాప్ లతో యువత కాలం గడిపేస్తోంది. అతిగా సోషల్ మీడియా వినియోగిస్తే మానసికంగా అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ వ్యసనం చాలా ప్రమాదకరం అని చెప్పేందుకు ఇంగ్లండ్ లో చోటు చేసుకున్న ఘటనే నిదర్శనం. ఫేస్‌బుక్‌ వ్యసనంలో పడి ఓ 19 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని లాంచెస్టర్‌లో జరిగింది.

The teen was obsessed with getting likes on social media

ఆమె పేరు క్లోయె డేవిసన్. వయసు 19 ఏళ్లు. కొన్ని నెలల కిందట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమె దగ్గర ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదు. క్లోయె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఎవరికీ తెలియలేదు. కానీ ఇటీవల ఆమెతో సన్నిహితంగా ఉండే స్నేహితురాలు నిజం బయటపెట్టింది. ఆ నిజం తెలిసి అంతా షాక్ అయ్యారు. తన ఫొటోలకు లైక్స్ రాలేదనే కారణంతోనే డేవిసన్ సూసైడ్ చేసుకుందని చెప్పింది.

Clair says more needs to be to help youngsters on social media following Chloe's suicide

క్లోయె చాలా అందంగా ఉంటుంది. ఒక హోటల్‌లో వెయిట్రెస్‌గా పనిచేసేది. తరుచూ ఫేస్‌బుక్‌లో తన ఫోటోలు పెట్టేది. కానీ తనను ఎవరూ ఇష్టపడడం లేదని, పట్టించుకోవడం లేదని బాధపడేది. అలా డిప్రెషన్‌లోనే ఉండేదని తెలిసింది. ఒక రోజు బాగా అందంగా తయారై తీసుకున్న సెల్ఫీలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది. కానీ ఆ ఫోటోలను ఎవరూ లైక్ చేయకపోవడంతో క్లోయె బాగా అప్ సెట్ అయ్యింది. ఆ డిప్రెషన్ లోనే ఆత్మహత్య చేసుకుంది.

Chloe, pictured with her older sister Jade

తన కూతురి ఆత్మహత్యకు కారణం తెలిసి క్లోయె తల్లి తీవ్ర ఆవేదన చెందింది. వెంటనే ఆమె ఓ నిర్ణయం తీసుకుంది. తన కూతురిలా సోషల్ మీడియాకు బానిసై ఎవరూ చనిపోకూడదని, సోషల్ మీడియా వ్యసనం నుంచి పిల్లలను దూరంగా ఉంచాలని తన చుట్టు పక్కల ఉన్న తల్లిదండ్రులకు చెబుతోంది. సోషల్ మీడియా వైపు నుంచి పిల్లలను నిజజీవితం వైపుకు తీసుకురావాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆమె అందరికీ సందేశాన్ని ఇస్తోంది. కాగా, సోషల్ మీడియా వల్ల అనేక మంది ప్రాణాలు తీసుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఓ కంట కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Chloe's mum, Clair, blamed social media "a lot for what has happened"