ఆస్ట్రేలియాలో ‘టెర్రర్ ఎటాక్’.. బీచ్ లో గన్ తో కాల్పులు.. LIVE Video
దుండగులకు దొరక్కుండా తలదాచుకునేందుకు తలో దిక్కుకు పరిగెత్తారు. ఆ కాల్పులు ఎంత భయంకరంగా ఉన్నాయో చెప్పారు ఓ ప్రత్యక్ష సాక్షి. ‘ధన్ ధన్ ధన్ అంటూ కాల్పుల శబ్దం వస్తూనే ఉంది.
ఆస్ట్రేలియాలో కాల్పులు జరిగాయి. రాజధాని సిడ్నీలోని ప్రముఖ బీచ్ అయిన బాండీ బీచ్ లో ఆగంతకులు కాల్పులు జరిపారు. ఇది టెర్రర్ ఎటాక్ గా భావిస్తున్నారు. ఈ కాల్పుల్లో సుమారు 10 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. జనం హ్యాపీగా బీచ్ లో గడుపుతున్న టైమ్ లో ఇద్దరు వ్యక్తులు గన్ తీసుకుని బీచ్ లో జనం మీద కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. కాల్పుల శబ్దం వినగానే జనం పరుగులు పెట్టారు. దుండగులకు దొరక్కుండా తలదాచుకునేందుకు తలో దిక్కుకు పరిగెత్తారు. ఆ కాల్పులు ఎంత భయంకరంగా ఉన్నాయో చెప్పారు ఓ ప్రత్యక్ష సాక్షి. ‘ధన్ ధన్ ధన్ అంటూ కాల్పుల శబ్దం వస్తూనే ఉంది. 10 నిమిషాల పాటు ధన్ ధన్ మని కాలుస్తూనే ఉన్నారు. ఎక్కడ చూసినా రక్తం. జనం అరుస్తున్నారు. పరుగులు పెడుతున్నారు. అంతా గందరగోళంగా అయిపోయింది.’ అని ప్రత్యక్ష సాక్షి చెప్పినట్టు AFP వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
The two terr***ist in Bondi Beach have been neutralised pic.twitter.com/snw9FSAKsP
— Aryan (@chinchat09) December 14, 2025
సిడ్నీ బీచ్ లో జరిగిన కాల్పులను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఖండించారు. ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఇద్దరు దుండగుల్లో ఒకరిని మట్టుబెట్టాయి. ఘటన జరిగిన తీరును బట్టి ఇది టెర్రర్ ఎటాక్ గా గుర్తించారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. సాధారణ ప్రజలు, పోలీసులతో సహా మొత్తం 29 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. దుండగులు వచ్చిన వాహనాన్ని పోలీసులు పరిశీలించగా అందులో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. బాండి బీచ్‌లో యూదులు జరుపుకొంటున్న హనుక్కా వేడకలను దుండగులు లక్ష్యంగా చేసుకొన్నట్లు అనుమానిస్తున్నారు
ఆస్ట్రేలియాలో జరిగిన ‘ఉగ్రదాడి’పై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు భారత ప్రభుత్వం తరఫున సంతాపం తెలిపారు.
Strongly condemn the ghastly terrorist attack carried out today at Bondi Beach, Australia, targeting people celebrating the first day of the Jewish festival of Hanukkah. On behalf of the people of India, I extend my sincere condolences to the families who lost their loved ones.…
— Narendra Modi (@narendramodi) December 14, 2025
