టెర్రరిస్ట్ ఎటాక్ : సానియా మీర్జా పోస్టులపై ఫైర్ 

  • Published By: veegamteam ,Published On : February 16, 2019 / 03:33 AM IST
టెర్రరిస్ట్ ఎటాక్ : సానియా మీర్జా పోస్టులపై ఫైర్ 

ఢిల్లీ :  జమ్మూ కశ్మీర్ పుల్వామా లో జరిగిన ఉగ్ర దాడిలో 44మంది బారత జవాన్లు బలయిన ఘటనపై యావత్ భారతదేశం దు:ఖసాగరంలో మునిగిపోయింది. భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. ఈ సందర్భంగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పెట్టిన పోస్టులపై నెటిజన్స్ మండి పడుతున్నారు.  ఉగ్రవాదుల దాడిలో భారత్ సైనికులు 44మంది మృతి చెందిన ఘటన కలచివేస్తుంటే..నువ్వు మాత్రం బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్నావంటూ..వీర మరణం పొందిన సైనికులకు భారత ప్రజలందరు నివాళులర్పిస్తుంటే డిజైనర్ దుస్తుల గురించి పోస్ట్ చేస్తావా అంటూ సానియాపై తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
 

జమ్మూ కశ్మీర్ పుల్వామా లో జరిగిన ఉగ్రదాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘోరకలిని భారత ప్రజలకు మరచిపోలేకపోతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దాడికి ప్రతిచర్యలు తప్పవంటు పాకిస్థాన్ కు హెచ్చరికలు చేసింది. ఈ సమయంలో టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యింది. భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా తన ఇన్స్‌స్టాగ్రామ్ లో తన సోదరి..ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనమ్ మిర్జా రూపొందించిన డిజైనర్ దుస్తులను ధరించి దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. దీనిపై సానియాపై నెటిజన్లు ఆగ్రహానికి గురిచేసింది. 
 

”దేశాన్ని కాపాడే సైనికులు ప్రాణాలు కోల్పోతే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు…నువ్వు కదా అసలైన పాకిస్థానీ” అంటూ ఒకరు ఘాటుగా కామెంట్ చేస్తే..”దేశంపై కాస్తయినా ప్రేమ చూపించు సానియా”అని ఇంకొందరు..`ఆమె పాకిస్థాన్‌ కోడలు…పాకిస్థాన్ మాదిరిగానే ఆమె ఆలోచనలు కూడా వుంటాయి” ”ఇలాంటి సమయంలో ఈ పోస్ట్ చేసినందుకు కాస్తయినా సిగ్గుపడు” అంటూ ఆమె ఫోటోపై నెటిజన్లు తీవ్ర పదజాలంతో కామెంట్లు చేస్తున్నారు.
 

ఆ తర్వాత పుల్వామా దాడిని ఖండిస్తూ సానియా ట్విట్టర్ ద్వారా స్పందిచారు. ”భారత సీఆర్ఫీఎఫ్ సైనికులపై హఠాత్తుగా జరిగిన దాడి.. తననెంతో బాధకు గురిచేసింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రటిస్తున్నా. ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి అసలు చోటు లేకుండా చేయాలి. శాంతి కోసం ప్రార్థించండి” అంటూ సానియా ట్వీట్ చేశారు. ఇటువంటి దు:ఖకర సమయంలోనే సానియా ఫ్యాషన్ డిజైనర్ దుస్తుల ఫోటోలు కూడా రావటం సరైంది కాదు అనే విషయం సానియా తెలుసుకోవాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

? @sarojjalan ? @makeupbyaliyabaig Styled by – @anammirzaaa

A post shared by Sania Mirza (@mirzasaniar) on