Turkey Capital: టర్కీలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి..
పార్లమెంట్ హౌస్, హోం మంత్రిత్వ శాఖ భవనం సమీపంలో దాడి జరిగిన ప్రదేశం చుట్టూ బాంబు పేలుడు తరువాత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Turkey bomb attack
Turkey Parliament Explosion: టర్కీ రాజధాని అంకారాలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాడి జరిగింది. ఆదివారం ఉదయం 9గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఒకరు ఘటన స్థలంలో మరణించగా, మరొకరు భద్రతా దళాల చేతిలో మరణించారు. ఈ పేలుడులో ఎంతమంది గాయపడ్డారు, ఎంత మంది మరణించారనే విషయంపై అధికారులు స్పష్టం ఇవ్వలేదు. అయితే, ఈ పేలుడులో స్థానిక పౌరులు ఎవరూ మరణించలేదని స్థానిక మీడియా పేర్కొంది.
GATE 2024 Application : గేట్ 2024 దరఖాస్తు గడువు పొడగింపు
ఇద్దరు ఉగ్రవాదులు వాణిజ్య వాహనంతో నేషనల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ భవనం వద్దకు చేరుకున్నారని, వారిలో ఒకరు తనను తాను పేల్చుకున్నాడని టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపారు. అయితే, బాంబు పేలుడు తరువాత పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో రెండో ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. పార్లమెంట్ హౌస్, ప్రభుత్వ మంత్రిత్వ శాఖ భవనాల సమీపంలో ఈ పేలుడు సంభవించింది.
Vande Bharat Sleeper Coach : వందేభారత్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త…వచ్చే ఏడాది స్లీపర్ కోచ్‌లు
ఇదిలాఉంటే .. వేసవి సెలవుల తరువాత టర్కీలో పార్లమెంట్ నేటి నుంచి ప్రారంభమవుతుంది. పార్లమెంట్ హౌస్, హోం మంత్రిత్వ శాఖ భవనం సమీపంలో దాడి జరిగిన ప్రదేశం చుట్టూ బాంబు పేలుడు తరువాత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ దాడిపై టర్కీ న్యాయ మంత్రి యిల్మాజ్ టున్ మాట్లాడుతూ.. ఈ ఆత్మాహుతి దాడిపై దర్యాప్తును అంకారా చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రారంభించిందని చెప్పారు. దాడిని ఖండిస్తూ, గాయపడిన పోలీసు అధికారులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ దాడులు ఉగ్రవాదంపై టర్కీ పోరాటాన్ని ఏవిధంగానూ అడ్డుకోలేవని చెప్పారు. ఉగ్రవాదంపై మా పోరాటం మరింత ఉధృతంగా ఉంటుందని చెప్పారు.