Uganda: పాఠశాలపై దాడి చేసిన ఉగ్రవాదులు.. 25 మంది మృతి
దాడికి పాల్పడిన వారు ఇస్లామిక్ స్టేట్‌కు విధేయత చూపుతున్న తిరుగుబాటు గ్రూపు అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎడిఎఫ్) సభ్యులని తెలిపిన అధికారులు దాడి చేసినవారు ఎంత మందిని అపహరించారనే వివరాలు వెల్లడించలేదు.

Terrorist attack: ఉగాండాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు సమీపంలో ఉన్న పాఠశాలపై ఇస్టామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 25 మంది చనిపోయారు. కాగా, మరికొందరిని అపహరించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. అపహరణకు గురైన వారిని రక్షించేందుకు, ఈ బృందాన్ని నాశనం చేసేందుకు తమ బలగాలు శత్రువులను వెంబడిస్తున్నాయని రక్షణ ప్రతినిధి ఫెలిక్స్ కులాయిగ్యే ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Actor Vijay: అంబేద్కర్, పెరియార్ వంటి నాయకులను వీలైనంత ఎక్కువ చదవండి.. విద్యార్థులతో దళపతి విజయ్
దాడికి పాల్పడిన వారు ఇస్లామిక్ స్టేట్‌కు విధేయత చూపుతున్న తిరుగుబాటు గ్రూపు అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎడిఎఫ్) సభ్యులని తెలిపిన అధికారులు దాడి చేసినవారు ఎంత మందిని అపహరించారనే వివరాలు వెల్లడించలేదు. దుండగులు శుక్రవారం అర్థరాత్రి పశ్చిమ సరిహద్దు పట్టణమైన మ్పోండ్వేలోని లుబిరిరా సెకండరీ స్కూల్‌పై దాడి చేసి, డార్మిటరీని తగలబెట్టి, ఆహారాన్ని దోచుకున్నారని పోలీసులు తెలిపారు.
“ఇప్పటి వరకు 25 మృతదేహాలను పాఠశాల నుంచి వెలికితీసి బ్వేరా ఆసుపత్రికి తరలించాము. అలాగే ప్రాణాలతో ఉన్న ఎనిమిది మంది బాధితులు బ్వేరా ఆసుపత్రిలో క్లిష్ట పరిస్థితిలో చికిత్స తీసుకుంటున్నారు” అని పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు. మృతుల్లో ఎంత మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారో పోలీసులు వెల్లడించలేదు. దాడి చేసిన వారు కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్ వైపు పారిపోయారని పోలీసులు తెలిపారు.