Tesla Offices: ఉద్యోగులను తొలగించి ఆఫీసు మూసేసిన టెస్లా
టెస్లా యాజమాన్యం 229 మంది ఉద్యోగులను తొలగించింది. ఆటోపైలట్ టీమ్ నుంచి ఉద్యోగులను తప్పించడంతో పాటు అమెరికాలోని ఒక ఆఫీసును కూడా క్లోజ్ చేసింది. కాలిఫోర్నియాలోని ఓ రెగ్యూలేటరీ ప్రకారం.. శాన్ మెటో ఆఫీసులో 276 వర్కర్లు ఉండేవారు.

Tesla Employees Had No Place To Sit, No Parking Slots When They Returned To Office
Tesla Offices: టెస్లా యాజమాన్యం 229 మంది ఉద్యోగులను తొలగించింది. ఆటోపైలట్ టీమ్ నుంచి ఉద్యోగులను తప్పించడంతో పాటు అమెరికాలోని ఒక ఆఫీసును కూడా క్లోజ్ చేసింది. కాలిఫోర్నియాలోని ఓ రెగ్యూలేటరీ ప్రకారం.. శాన్ మెటో ఆఫీసులో 276 వర్కర్లు ఉండేవారు. మిగిలిన ఉద్యోగులైన 47మందిని టెస్లా బఫెలో ఆటోపైలట్ ఆఫీసుకు పంపించారు.
చాలా మంది ఉద్యోగులు తక్కువ నైపుణ్యం కలవారు, తక్కువ శాలరీల వారు అంటే ఆటోపైలట్ డేటా లేబులింగ్ లాంటి పనిచేసేవారే. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ గత నెలలో ప్రకటించిన 10శాతం కాస్ట్ కటింగ్‌లో భాగంగానే ఈ తొలగింపులు జరిగాయని అంటున్నారు. ఉద్యోగులను తొలగించిన తర్వాత టెస్లా ఉద్యోగుల సంఖ్య 3.5 శాతం తగ్గనున్నాయి.
గత నెలలో కూడా టెస్లా.. ఉద్యోగులను విధుల్లో నుంచి తప్పించింది. వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదుల బృందం US కోర్టు నుండి అత్యవసర రక్షణను కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
లేఆఫ్‌ల సమయంలో ఫెడరల్ చట్టం ప్రకారం అవసరమైన 60 రోజుల ముందస్తు నోటీసును కంపెనీ అందించలేదని ఫిర్యాదుదారులు ఆరోపించారు.