వ్యాక్సిన్ అనేది అందరికీ ఓకే కాదట.. తీసుకున్నా.. తీసుకోకపోయినా ఒకటే

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌ను రిలీజ్ చేసినట్లుగా రిజిస్టర్ చేసుకున్న తొలి దేశం రష్యా. వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించి యావత్ ప్రపంచం ప్రశంసలను ఆ దేశం కొట్టేసింది. ఇక ప్రమాదమేముంది ఆ దేశ ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకుని హాయిగా ఉంటున్నారనుకోవద్దు. అక్కడ Corona Vaccine వేసుకోవడానికి సగం మంది వెనకడుగేస్తున్నారట. కారణం వ్యాక్సిన్ ఫలితాలేనంటున్నారు నిపుణులు.
తాజా నివేదికల ప్రకారం.. Corona Vaccine ఉచితంగానే ఇస్తున్నా పంపిణీ కేంద్రాలు ఖాళీగానే దర్శనమిస్తున్నాయంటున్నారు నిపుణులు. అత్యవసర వినియోగానికి అనుమతులు వచ్చిన వెంటనే దానిని అతిపెద్ద విజయంగా ప్రకటించుకున్న రష్యాలో.. ఈ ప్రజల్లో వ్యక్తమవుతోన్న భిన్నాభిప్రాయాలు దేశాన్నే వెనుకడుగేసేలా చేస్తున్నాయి.
తుది దశ ప్రయోగాలు కొనసాగుతున్న దశలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడం పట్ల అసంతృప్తి చెందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్ Corona Vaccineను తప్పని పరిస్థితుల్లో తీసుకోవలసి వచ్చిందని కరోనా రోగులకు చికిత్స అందిస్తోన్న అక్కడి స్థానిక వైద్యులు అంటున్నారు.
Corona Vaccineను ఉచితంగా పంపిణీ చేసినప్పటికీ తీసుకునేందుకు మెజారిటీ రష్యన్లు సిద్ధంగా లేరని తాజా సర్వేలో వెల్లడైంది. రష్యాకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ లెవాడా సెంటర్ అక్టోబర్‌లో నిర్వహించిన సర్వేలో, దాదాపు 59శాతం ప్రజలు వ్యాక్సిన్‌పై అనాసక్తి కనబరిచినట్లు ప్రకటించింది.
‘వైరస్ బారిన పడటం కంటే వ్యాక్సిన్ తీసుకోవడమే ప్రస్తుతం మా ముందున్న అవకాశం’ అని మాస్కో సమీపంలోని కొవిడ్ ఆసుపత్రి డాక్డర్ జాట్‌సెపిన్ అభిప్రాయపడ్డారు. Corona Vaccineతీసుకున్నప్పటికీ దాని సమర్థతపై పూర్తి ఫలితాలు ఇంకా రాలేదని.. అందుకే ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు వ్యాక్సిన్‌పై కచ్చితమైన నమ్మకం మాత్రం కలుగలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Corona Vaccine అందుబాటులోకి వచ్చేస్తుందని అషీషియల్‌గా చేసిన ప్రకటనపై రష్యాలోనే కాకుండా అంతర్జాతీయంగా విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాక్సిన్‌ను వేల మందిపై చేసే తుదిదశ ప్రయోగాలు పూర్తికాకముందే ప్రజలకు అందుబాటులోకి తేవడం సరికాదంటూ లోకల్, ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్‌లు హెచ్చరించారు. అనుమతులు వచ్చిన కొన్ని వారాల్లోనే కరోనా యోధులు, ఆరోగ్య సిబ్బంది వంటి వైరస్ ముప్పు ఉన్నవారికి Corona Vaccineను ఇవ్వడం ప్రారంభించింది. కేవలం వారంలోనే దాదాపు లక్షా 50వేల మంది రష్యన్లు వ్యాక్సిన్ తీసుకున్నట్లు టీకా తయారు చేసిన గమలేయా ఇన్‌స్టిట్యూట్ అధిపతి అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ వెల్లడించారు.
బ్రిటన్ పర్మిషన్‌తో మరింతగా..
వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిస్తున్నట్లు బ్రిటన్ డిసెంబర్ 2న ప్రకటించింది. వెంటనే అప్రమత్తమైన రష్యా అధ్యక్షుడు పుతిన్.. Corona Vaccine పంపిణీ భారీ స్థాయిలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొద్ది రోజుల్లోనే దాదాపు 20లక్షల డోసులను ప్రభుత్వ, ప్రైవేటు వైద్య, విద్యా సంస్థలు, మునిసిపల్ సిబ్బంది అందరికీ ఉచితంగా Corona Vaccine ఇవ్వాలని పేర్కొన్నారు. యూకేలో ముందుగా వృద్ధులకే ప్రాధాన్యం ఇస్తుండగా..రష్యాలో మాత్రం 18నుంచి 60ఏళ్ల వారికే వ్యాక్సిన్ తొలుత పంపిణీ చేస్తుండటం గమనార్హం.