Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన

ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు షాక్ అయ్యారు. ముందు రోజు సాయంత్రం ఇంట్లో అతడి పెళ్లి రోజు వేడుక ఘనంగా జరగడమే వారు షాక్ కావడానికి కారణం. అయితే, ఆ సంఘటనను భర్త ఎలా మర్చిపోయారో భార్యకు అర్థం కాలేదు.

Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన

Forgetfulness

Updated On : May 29, 2022 / 9:51 AM IST

Strange incident : ఐర్లాండ్ లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. భార్యతో శృంగారంలో పాల్గొన్న పది నిమిషాలకే ఓ వ్యక్తి మతిమరుపుకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన కథనాన్ని ఐరిష్ జర్నల్ ప్రచురించింది. వివరాల్లోకి వెళ్తే.. 66 ఏళ్ల ఓ వ్యక్తి తన భార్యతో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి తన మొబైల్ ఫోన్ లో తేదీని చూసుకుని, ముందు రోజు తన పెళ్లి రోజు కదా అదెలా మర్చిపోయానంటూ ఆశ్చర్యానికి గురయ్యాడు.

ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు షాక్ అయ్యారు. ముందు రోజు సాయంత్రం ఇంట్లో అతడి పెళ్లి రోజు వేడుక ఘనంగా జరగడమే వారు షాక్ కావడానికి కారణం. అయితే, ఆ సంఘటనను భర్త ఎలా మర్చిపోయారో భార్యకు అర్థం కాలేదు. దీంతో ముందు రోజు సాయంత్రం జరిగిన పెళ్లి రోజు వేడుకను పదే పదే గుర్తు చేసేందుకు భార్యాపిల్లలు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది.

Memory Loss : గతం మర్చిపోయిన భర్త..భార్యను చూసి షాక్..స్కూల్ కు వెళతానంటూ మారాం

అయితే తన పేరు, వయసు, పాత విషయాలను మాత్రం సదరు వ్యక్తి గుర్తు పెట్టుకోవడం విశేషం. దీన్ని వైద్యులు స్వల్పకాలిక మతిమరుపుగా పేర్కొన్నారు. వైద్య పరిభాషలో ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా అంటారని వెల్లడించారు. ఇది 50 నంచి 70 ఏళ్ల మధ్య వ్యక్తులపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఈ వ్యక్తి 2015లో టీజీఏ ప్రభావానికి లోనయ్యారు. ఆ సమయంలోనూ భార్యతో శృంగారంలో పాల్గొన్న తర్వాతే కావడం విచిత్రం.