Special Section in Flights : ఫ్లైట్‌లో ‘పెద్దలకు మాత్రమే’ జోన్ ప్రారంభిస్తున్న ఓ ఎయిర్ లైన్స్.. దీని అర్ధం ఏంటంటే?
కొరెండన్ ఎయిర్‌లైన్స్ కొన్ని మార్గాల్లో 'పెద్దలకు మాత్రమే' జోన్ అందిస్తోందట. నవంబర్ నుంచి అమలు కానున్న ఈ జోన్ ఏర్పాటు చేయడం వెనుక కారణం ఏంటంటే?

Adult-only section in flights
Adult only section in flights : విమాన ప్రయాణం ప్రశాంతంగా జరిగేలా.. రద్దీలో పిల్లలు ఏడుస్తుంటే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఒక ఎయిర్ లైన్స్ సంస్థ కొత్త విభాగాన్ని ప్రారంభించింది. ‘పెద్దలకు మాత్రమే’ అనే పేరుతో ప్రారంభించిన ఈ జోన్ వివరాలు ఏంటంటే?
Vistara flight : ‘ నా కూతుర్ని బెదిరిస్తావా? నీకెంత ధైర్యం?’ విస్తారా ఫ్లైట్‌లో ఓ తండ్రి ఫైట్
విమానాల్లో ప్రయాణించే వారు తమ ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటారు. రద్దీ సమయంలో పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తుంటారు. ఆ సమయంలో కొందరు ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ఇబ్బందులు తొలగించడానికి టర్కిష్-డచ్ లీజర్ క్యారియర్ కొరెండన్ ఎయిర్‌లైన్స్ కొన్ని మార్గాల్లో ‘పెద్దలకు మాత్రమే’ జోన్‌ను అందిస్తోందట. ఈ విషయాన్ని తాజాగా ఆ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. ఈ కొత్త విభాగం ద్వారా ఎయిర్ బస్ A350 లలో కొన్ని సీట్లు రిజర్వ్ చేయబడతాయట. డచ్ కరేబియన్ ద్వీపం అయిన ఆమ్‌స్టర్‌డామ్, కురాకో మధ్య ఈ జోన్‌లు నవంబర్‌లో ప్రారంభం కానున్నాయి.
Bengaluru : మొదటిసారి ఫ్లైట్ ఎక్కాడట.. తెలియక తప్పు చేశాడట.. విమానంలో షాకింగ్ ఘటన
గోడలు, కర్టెన్లతో ఈ ప్రత్యేక విభాగం మిగిలిన విమానం నుండి వేరు చేయబడుతుందట. ఇందులో 9 అదనపు సీట్లు, అదనపు లెగ్ రూమ్, 93 స్టాండర్డ్ సీట్లతో ఉంటాయి. ఈ సీట్లకు ఒక మార్గంలో అదనంగా 45 యూరోలు (4,021.16 ఇండియన్ కరెన్సీలో) చెల్లించాల్సి ఉంటుంది, అయితే అదనపు పెద్ద సీట్లకు అదనంగా 100 యూరోలు (8,936.14 ఇండియన్ కరెన్సీలో) చెల్లించాల్సి ఉంటుంది. ఈ వినూత్నమైన జోన్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఎయిర్ లైన్స్ కొరెండన్ కాదు.. అంతకంటే ముందు నెదర్లాండ్స్‌లో విభాగం అమలులో ఉందట.